NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

తిరుమల తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. నేడు CVSO శ్రీధర్‌ను విచారించనున్న కమిషన్‌. 21 నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్‌ సిబ్బంది 32 మంది పోలీసులను విచారించనున్న కమిషన్‌. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ.

వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై నేడు తుది విచారణ.

SLBC టన్నెల్‌లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌. గల్లంతైన ఏడుగురి కోసం క్యాడవర్‌ డాగ్స్‌తో గాలింపు. డీ2, డీ1 ప్రదేశాల్లో మిని జేసీబీలతో తవ్వకాలు. ఆచూకీ లభిస్తే మాన్యువల్‌గా తవ్వే యోచనలో బృందం.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,750 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,960 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 1,03,800 లుగా ఉంది.

నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు. నేడు సభలో ఎస్సీ కమిషన్‌ నివేదికపై కీలక చర్చ.

నేటితో ముగియనున్న ఏపీ ఎమ్మెల్యే, MLCల క్రీడాపోటీలు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు.

నేటి నుంచి కేటీఆర్‌ రాష్ట్రవ్యాప్త పర్యటన. నేడు సూర్యాపేటలో పర్యటించనున్న కేటీఆర్‌. ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో భేటీకానున్న కేటీఆర్‌.

నేడు విశాఖ స్టేడియం దగ్గర వైసీపీ ఆందోళన. విశాఖ స్టేడియానికి వైఎస్‌ పేరు తొలగింపునకు నిరసన. పాల్గొననున్న మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్‌.

HYD: బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసులో విచారణ. మరో ఆరుగురికి పంజాగుట్ట పోలీసుల నోటీసులు. నేడు విచారణకు రావాలని నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్‌, సుప్రీత, సన్నీ సుధీర్‌, అజయ్‌ సన్నీకి ఆదేశాలు. ఆరుగురు నేడు విచారణకు హాజరయ్యే అవకాశం.

హైదరాబాద్‌: నేడు ఓయూలో విద్యార్థి సంఘాల ధర్నా.