నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. మొదటి రోజు స్విట్జర్లాండ్‌లో భారత్ హైకమిషనర్‌తో భేటీ. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. ఎన్నారైలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం బృందం. దావోస్ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు.
ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన. సింగపూర్ నుంచి దావోస్‌కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటన. గత పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న ప్రభుత్వం.
నేడు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మైనింగ్ మంత్రులు జాతీయ సదస్సుకు హాజరుకానున్న భట్టి విక్రమార్క.
నేడు నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన. కనగల్‌లో జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించనున్న కోమటిరెడ్డి. పలు అభివృద్ధి పనుల శంకుస్థానలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్న కోమటిరెడ్డి.
నేడు టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందుకు ఎమ్మెల్యే కొలికపూడి. ఉదయం 11 గంటలకు టీడీపీ ఆఫీస్‌లో క్రమశిక్షణా కమిటీ భేటీ. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై అధిష్టానం సీరియస్. కొలికపూడి వైఖరిపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందుక హాజరైన కొలికపూడి.
నేడు కాకినాడకు డీజీపీ ద్వారాకా తిరుమలరావు. ఎస్పీ ఆఫీస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్న ఏపీ డీజీపీ.
నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సాధారణ దర్శనాలు. నేడు తిరుమలేశుడి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
ఏపీలో నేటి నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు. ఈ నెల 31 వరకు గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలు. పశువులు, గొర్రెలు, మేకలకు మందులు వేయనున్న వైద్యులు.
నేడు అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం. ట్రంప్ ప్రమాణస్వీకారంపై వాతావరణ ప్రభావం. వాషింగ్టన్‌లో మంచు, చలి కారణంగా ఇండోర్స్‌లోనే ప్రమాణం. నేడు వాషింగ్టన్‌లో ఉష్ణోగ్రత మైనస్ 11 డిగ్రీలుగా ఉంటుందని వాతావరణశాఖ అంచనా. 40 ఏళ్ల తరువాత ఇండోర్స్‌లో అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం.
నేడు హైదరాబాద్‌కు కాళేశ్వరం విచారణ కమిటీ. విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చే అవకాశం. మాజీ మంత్రులను విచారించే అవకాశం.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు. నిందితుడు సంజయ్ రాయ్‌కు నేడు శిక్ష ఖరారు. ఇప్పటికే సంజయ్‌ను దోషిగా తేల్చిన కోల్‌కతా కోర్టు.
తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఆదిలాబాద్‌లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. పటాన్ చెరులో 11, మెదక్‌లో 13.3 డిగ్రీలు. రామగుండంలో 14.5, హనుమకొండలో 15 డిగ్రీలు.. హైదరాబాద్‌లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.