Site icon NTV Telugu

What’s Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు జగనన్న తోడు నిధులు జమ. వర్చువల్‌గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్న జగన్‌. 5,10,412 మంది లబ్దిదారులకు రూ.549.70 కోట్ల రుణాలు.

2. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల. అక్టోబర్‌ కోటా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.

3. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,980 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,980 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.81,500 లుగా ఉంది.

4. నేటి నుంచి కొరియా ఓపెన్‌ బాడ్మింటన్‌ టోర్నీ. టైటిల్‌పై పీవీ సింధు, శ్రీకాంత్‌ గురి.

5. తెలంగాణకు భారీ వర్ష సూచన. వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు. నేడు, రేపు తెలంగాణలో అతిభారీ వర్షాలు. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ.

6. నేడు ఢిల్లీలో ఎన్డీఏ మిత్ర పక్షాల సమావేశం. ఎన్డీఏ నుంచి 38 పార్టీలకు ఆహ్వానం. సమావేశానికి హాజరుకానున్న పవన్‌ కల్యాణ్‌.

7. నేడు రెండో రోజు బెంగళూరులో విపక్షాల సమావేశం. ఈరోజు సమావేశానికి హాజరుకానున్న శరద్‌ పవార్‌. బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు సన్నాహాలు. కూటమికి కొత్త పేరు, సమన్వయకర్త నియామకంపై చర్చ.

8. నేడు హైదరాబాద్‌లో బీజేపీ కిసాన్‌ మోర్చా ఆందోళనలు. రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌.

9. నేటి నుంచి పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌.

10. నేడు సుప్రీంకోర్టులో అవినాష్ బెయిల్‌ కేసు విచారణ. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసిన సునీత. అవినాష్‌ బెయిల్‌పై కౌంటర్‌ దాఖలు చేయని సీబీఐ.

Exit mobile version