NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేటి నుంచి తిరిగి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం. ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలపనున్న సభ. ఇంద్రసేనారెడ్డికి సంతాపం తెలపనున్న శాసనమండలి. రెండు బిల్లులను ఆమోదించనున్న తెలంగాణ అసెంబ్లీ. స్పోర్ట్స్‌, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులకు ఆమోదం. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం.

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీహాల్‌లో కేబినెట్‌ భేటీ.

నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్ట్‌కు చంద్రబాబు. ప్రాజెక్ట్‌ నిర్మాణాల క్షేత్రస్థాయి పర్యటన. భూసేకరణ, రిహాబిలిటేషన్‌పై సమీక్షించనున్న సీఎం. ప్రాజెక్ట్‌ కార్యచరణ షెడ్యూల్‌ ప్రకటించునున్న సీఎం.

నేడు గాంధీభవన్‌లో హైదరాబాద్‌ డీసీసీ సమావేశం. మంత్రి పొన్నం అధ్యక్షతన జరగనున్న సమావేశం.

తిరుమల: నేటి నుంచి ధనుర్మాసం నెల ప్రారంభం. రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవ రద్దు. నెల రోజుల పాటు శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహణ.

తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,880 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,390 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900 లుగా ఉంది.

ఢిల్లీ: నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం. ఉదయం 11 గంటలకు బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య, సానా సతీష్‌ ప్రమాణ స్వీకారం. ఏపీ నుంచి ఈనెల 13న రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య, సానా సతీష్‌.

ఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాజ్యాంగంపై చర్చ. రాజ్యసభలో నేడు, రేపు రెండు రోజుల పాటు రాజ్యాంగంపై చర్చ.

పేర్నినాని భార్య జయసుధ పేరుపై ఉన్న గోదాములో రేషన్‌ స్టాక్‌ తగ్గటంతో కేసు నమోదు. ఇప్పటికే సివిల్‌ సప్లై అధికారులకు రూ.కోటి చెల్లించినట్లు సమాచారం. పేర్నినాని ఫ్యామిలీ కోసం 3 బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు. నేడు పేర్నినాని భార్య జయసుధ ముందస్తు బెయిల్‌పై విచారణ.

Show comments