Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

విదేశి పర్యటనలో ప్రధాని మోడీ. నేడు, రేపు కెనడాలో పర్యటించనున్న మోదీ. జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ. నిన్న సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌తో మోడీ భేటీ. వాణిజ్యం, పెట్టుబడి అంశాలపై చర్చించిన మోదీ.

నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. ఈ నెల 21న యోగా డే సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన. మంత్రుల కమిటీ, అధికారులతో చర్చించనున్న చంద్రబాబు. బీచ్‌ రోడ్‌లో ఏర్పాట్లను పరిశీలించనున్న చంద్రబాబు.

నేడు తెలంగాణలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం. వ్యవసాయ వర్సిటీలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌. రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న రేవంత్‌. 1,031 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం.

HYD: నేడు మంత్రి వర్గ సభ్యులతో సీఎం రేవంత్‌ సమావేశం. రైతు భరోసా, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ.

HYD: నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్‌. ఫార్ములా ఈ కేసులో విచారించనున్న ఏసీబీ అధికారులు. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయల్దేరనున్న కేటీఆర్‌.

నేడు తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్టిమెంటరీ ఫలితాలు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఫలితాలు.

నేడు అమరావతికి కొల్లేరు సాధికార కమిటీ. సీఎం చంద్రబాబుతో భేటీకానున్న కమిటీ. ఈ నెల 17,18లో కొల్లేరు గ్రామాల్లో పర్యటన. మత్స్యకారులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా. వినతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కొల్లేరు ప్రజలు.

గుంటూరు: నేడు జైలు నుంచి విడుదల కానున్న కొమ్మినేని. మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేని ఏ2. నేడు బెయిల్‌పై విడుదల కానున్న జర్నలిస్ట్‌ కొమ్మినేని.

ఢిల్లీ: జనగణనపై నేడు అధికారిక గెజిట్‌ వెలువడే అవకాశం. జనగణనపై నిన్న సమీక్ష నిర్వహించిన అమిత్‌ షా. రెండు దశల్లో జనగణన కార్యక్రమం.

నేడు గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో మృతి చెందిన విజయ్‌ రూపానీ. డీఎన్‌ఏ ఆధారంగా భౌతికకాయాన్ని గుర్తించిన అధికారులు. రాజ్‌కోట్‌లో విజయ్‌ రూపానీ అంత్యక్రియలకు ఏర్పాట్లు. నేడు గుజరాత్‌ వ్యాప్తంగా సంతాప దినం.

ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. నేడు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన. తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. సిద్దిపేట, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.

 

Exit mobile version