Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

*నేడు తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవం.. రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు

*నేటితో కేసీఆర్‌ సర్కార్‌కు 9 ఏళ్లు పూర్తి

*గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేయనున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న వేడుకలు

*నేడు ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

*ఏపీలో నేటి నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష

*సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

*అమరావతి: నేడు సీఎం జగన్‌ గుంటూరు జిల్లా పర్యటన.. వైఎస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా –2లో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్న సీఎం..

*అమరావతి: ఏపీలో మరో మూడ్రోజులు వడగాలులు.. నేడు ఏపీ వ్యాప్తంగా 302 మండలాల్లో వడగాలులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన.

*తిరుమల: నేటి నుంచి 3 రోజుల పాటు శ్రీవారి జేష్ఠాభిషేకం.. ఇవాళ వజ్రకవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. ఈ నెల 4న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేయనున్న టీటీడీ

*తిరుపతి: వేడుకగా గోవిందరాజస్వామీ బ్రహ్మోత్సవాలు.. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి రథోత్సవ సేవ

*తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,760.. కిలో వెండి ధర రూ.77,600

Exit mobile version