What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఉదయం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్ సీఎం రేవంత్. తర్వాత భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదల అధికారులతో సమీక్ష. సాయంత్రం 4గంటలకు మణుగూరులో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ.
నేడు 18 రాష్ట్రాల జాతీయ రహదారులు ప్రారంభం. వర్చువల్‌గా రహదారులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఏపీలో కడప-బెంగళూరు కనెక్టివిటీ హైవే ప్రారంభం. ఏపీలో జాతీయ రహదారుల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్
Also Read
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
నేడు కేంద్రమంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశం. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తు. నేటి సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి. నేడు లేదా రేపు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్.
నేటితో శ్రీశైలంలో ముగియనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. అశ్వవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న ఆదిదంపతులు. సాయంత్రం శ్రీస్వామి అమ్మవారు అశ్వవాహనంపై ఆలయ ప్రదక్షిణ. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు ముగింపు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,740 లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,260 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.79,000 లుగా ఉంది.
నేడు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ.5లక్షల సాయం. భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్.
నేడు పులివెందులలో సీఎం జగన్ పర్యటన. మెడికల్ కాలేజీ, ప్రభుత్వాస్పత్రి ప్రారంభోత్సవం. రూ.862 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. అనంతరం ఇడుపులపాయకు వెళ్లనున్న సీఎం జగన్. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం.
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం. ఉదయం 10 గంటలకు అన్నమయ్య భవన్లో సమావేశం.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్ల దాఖలు గడువు. నేడు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు.
నేటి నుంచి యాదాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. 11 రోజుల పాటు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తొలిరోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్. 18న స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం.
తాజావార్తలు
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..