Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన. ఉదయం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్ సీఎం రేవంత్‌. తర్వాత భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్‌. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదల అధికారులతో సమీక్ష. సాయంత్రం 4గంటలకు మణుగూరులో సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగ సభ.

నేడు 18 రాష్ట్రాల జాతీయ రహదారులు ప్రారంభం. వర్చువల్‌గా రహదారులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఏపీలో కడప-బెంగళూరు కనెక్టివిటీ హైవే ప్రారంభం. ఏపీలో జాతీయ రహదారుల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌

నేడు కేంద్రమంత్రి షెకావత్‌, చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి సమావేశం. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తు. నేటి సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి. నేడు లేదా రేపు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్‌.

నేటితో శ్రీశైలంలో ముగియనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. అశ్వవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న ఆదిదంపతులు. సాయంత్రం శ్రీస్వామి అమ్మవారు అశ్వవాహనంపై ఆలయ ప్రదక్షిణ. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు ముగింపు.

తెలుగు రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,740 లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,260 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.79,000 లుగా ఉంది.

నేడు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ.5లక్షల సాయం. భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్‌.

నేడు పులివెందులలో సీఎం జగన్‌ పర్యటన. మెడికల్‌ కాలేజీ, ప్రభుత్వాస్పత్రి ప్రారంభోత్సవం. రూ.862 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. అనంతరం ఇడుపులపాయకు వెళ్లనున్న సీఎం జగన్‌. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం.

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం. ఉదయం 10 గంటలకు అన్నమయ్య భవన్‌లో సమావేశం.

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్ల దాఖలు గడువు. నేడు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు.

నేటి నుంచి యాదాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. 11 రోజుల పాటు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తొలిరోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్‌. 18న స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం.

 

Exit mobile version