Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు మహబూబ్‌నగర్‌కు మంత్రి కేటీఆర్‌. స్మిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు భూమిపూజ. జడ్చర్లలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రారంభించినున్న కేటీఆర్‌.

2. నేడు విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష. స్కూల్స్‌ ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. నాడు-నేడు పనుల పురోగతి, విద్యాకానుక, అమ్మ ఒడి అమలుపై చర్చ.

3. నేటి నుంచి భట్టి పీపుల్స్‌ యాత్ర పాదయాత్ర. నల్గొండ నక్కలగండి ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న భట్టి.

4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650 లుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77,800 లుగా ఉంది.

5. నేడు ఉదయం 11.30కి జాతీయ మహిలా కమిషన్‌ ఎదుట శేజల్‌. దుర్గం చిన్నయ్య వేధింపులపై మహిళా కమిషన్‌కు వివరించనున్న శేజల్‌.

6. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాలుగు రోజులు పాటు నిర్వహించే పంచమ బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

7. ప్రకాశం జిల్లా ఒంగోలు గోపాల్ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

8. ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీ నరశింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి చక్రస్నానం, ధ్వజావరోహనం..

9. ప్రకాశం జిల్లా ఒంగోలు రంగా భవన్ లో ఆచార్య రంగా కిసాన్ సంస్థ అధ్వర్యంలో ఆచార్య రంగా వర్ధంతి వేడుకలు.

Exit mobile version