NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీ. రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం. నిర్మాణాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఐఐటీ నిపుణులు.

తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావారణ శాఖ. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,710 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,900 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.87,500 లుగా ఉంది.

అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన. పలు కంపెనీలతో సీఎం రేవంత్‌ బృందం వరుస భేటీలు.

నేడు బాపట్ల జిల్లా చీరాలలో చంద్రబాబు పర్యటన. చేనేత సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 3.30 గంటలకు చీరాలకు చేరుకోనున్న చంద్రబాబు. చేనేతలకు ప్రత్యేక ప్ర్యాకేజీ ప్రకటించే అవకాశం. ఏపీ ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు ద్వారా 25 వేల ఉద్యోగాలకు ఆమోదం తెలపనున్న చంద్రబాబు. 26 సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ. 8వ తరగతి అర్హతతో రూ.5లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాల పథకం ప్రకటించే అవకాశం.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ. నేడు కూడా హైకోర్టులో కొనసాగున్న విచారణ. 3 నెలలలోపు అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకునేలా అదేశాలు ఇవ్వాని కోరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.

నేడు వైసీపీని వీడనున్న పెండెం దొరబాబు. ఇప్పటికే కూటమి నేతలతో మంతనాలు జరిపిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.

హర్‌ ఘర్‌ తిరంగాపై నేటి నుంచి తెలంగాణ బీజేపీ సమావేశాలు. నేడు జిల్లాల్లో, రేపు, ఎల్లుండి మండలాల్లో సమావేశాలు. ఈ నెల 10, 11న స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాల శుద్ధి. ఈ నెల 12న మహిళల తిరంగా బైక్‌ ర్యాలీలు. 13, 14, 15న ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలన్న బీజేపీ.

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై మాజీ సీఎం జగన్‌ ఫోకస్‌. నేడు, రేపు విశాఖ నేతలతో భేటీకానున్న జగన్‌. ఇప్పటికే విశాఖ MLC అభ్యర్థిగా బొత్స పేరు ప్రకటన.

నేడు జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక. వ్యూహ ప్రతి వ్యూహాల్లో కూటమి, వైసీపీ. జీవీఎంసీ సభ్యులుగా ఉన్న 97 మంది కార్పొరేటర్లు. ఇప్పటికే బరిలో 20 మంది అభ్యర్థులు. వైసీపీ సభ్యులను ఆకర్షించేందుకు కూటమి వ్యూం.

నేడు గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్‌ సమావేశం. నామినేటెడ్‌ పోస్టుల విషయంలో సునీతారావు అసహనం నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత.

సీబీఐ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ.

Show comments