నేడు రేపల్లె వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన..
నేడు మెదక్ జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. మెదక్ కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించనున్న మంత్రి దామోదర.
నేడు ఖమ్మం వరద బాధితులకు బట్టలు, నిత్యవసర వస్తువుల పంపిణీ చేయనున్న ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటిలు..
నేడు సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటన.. నియోజకవర్గంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు.
నేడు విశాఖలో బీజేపీ సంస్థగత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవం.. ముఖ్య అతిథిగా పాల్గొననున్న రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి..
నేడు వరద బాధితులకు లక్ష పాల ప్యాకెట్లు అందించనున్న వైసీపీ..
నేడు ఏపీ హైకోర్టులో కీలక తీర్పులు.. టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో.. వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్న హైకోర్టు..
నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో యథావిధిగా రైళ్ల రాకపోకలు.. మహబూబాబాద్ లోని ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ఢిల్లీకి రాకపోకలు..
నేడు పారాలింపిక్స్‌లో భారత్ షెడ్యూల్ ఇదే!