NTV Telugu Site icon

What’s Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

విశాఖ: కోడికత్తి కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ. వాయిదాకు హాజరు కానున్న నిందితుడు జనిపల్లి శ్రీనివాస్.

అమరావతి: ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేత చర్యలపై నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 21 వైసీపీ కార్యాలయాలు వేర్వేరు కారణాలతో కూల్చివేతలు, నోటీసులు ఇస్తున్నారని పిటిషన్లు దాఖలు. అన్నీ పిటిషన్లు మీద విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.తీర్పు ఇచ్చే వరకు కార్యాలయాల కూల్చివేత పై యధా తథ స్థితి కొనసాగించాలని స్టేటస్ కో ఆదేశాలు గతంలోనే ఇచ్చిన న్యాయస్థానం.

అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు. పిటిషన్. తనకు 4+4 ఉన్న భద్రతను తగ్గించారని పిటిషన్.నేడు విచారణ చేయనున్న హైకోర్టు.

ప్రకాశం : ఒంగోలులో నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల బంద్.. ఒంగోలు రిమ్స్ లో వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం, హాజరుకానున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..

తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన. ఉదయం 10:00 గంటలకు రాజమండ్రి గోదావరి గొట్టు నందు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:00 గంటలకు నిడదవోలు పట్నం గాంధీ నగర్ లో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 01:00 గంటలకు అజ్జరం గ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.

నెల్లూరు: నేడు నెల్లూరులో వైసీపీ అధినేత జగన్ పర్యటన. ఉదయం 10 గంటల 30 నిముషాలకు నెల్లూరు రూరల్ మండలంలోని కనపర్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ కు చేరుకోనున్న జగన్. అనంతరం వెంకటాచలం మండలం కాకుటూరులోని నెల్లూరు కేంద్ర కారాగారానికి వెళ్లనున్న జగన్. కేంద్ర కారాగారంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పరామర్శ. 12 గంటలకు హెలిప్యాడ్ కు చేరుకుని తాడేపల్లికి వెళ్లనున్న జగన్.

విశాఖ: నేడు ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సిన పలు డిగ్రీ పరీక్షలు వాయిదా. విద్యార్థి సంఘాల బంద్ పిలుపుతో పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రకటించిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్.

తిరుమల: ఈనెల 16వ తేదిన ఆణివార ఆస్థానం. సాయంత్రం పుష్పపల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి. 18వ తేదిన అక్టోబర్ నెలకు సంభందించిన దర్శన టిక్కేట్లు ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్న టిటిడి.

తిరుమల: ఆరు నెలల కాలంలో శ్రీవారిని దర్శించుకున్న కోటి 26 లక్షల 82 వేల మంది భక్తులు. హుండి ద్వారా ఆరు నెలల కాలంలో 669.93 కోట్లు సమర్పించిన భక్తులు

తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 16 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69632 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 30179 మంది భక్తులు. హుండి ఆదాయం 3.32 కోట్లు.

గుంటూరు: టిడిపి కేంద్ర కార్యాలయం ధ్వంసం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. దాడిలో పాల్గొన్న మరో 27 మంది నిందితుల గుర్తింపు. ఈ కేసులో మొత్తం 70 మందికి పైగా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా గుర్తించిన పోలీసులు…

అమరావతి: ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ గవర్నర్. ఉదయం 08:20 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్ నజీర్.

కడప: నేడు కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం. కార్పొరేషన్ ఏర్పాటు జరిగిన నాటి నుంచి మొదటిసారి గా అడుగు పెడుతున్న టిడిపి ఎమ్మెల్యేలు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ఎక్స్ అఫీషియో మెంబర్లుగా మొదటిసారిగా సమావేశానికి హాజరుకానున్నారు… ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్ లో 49 మంది వైసీపీ కార్పొరేటర్లు ఒక్క టీడీపీ కార్పొరేటర్ ఉన్నారు.

హైదరాబాద్‌: ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రధాని మోడీ ని కలిసే అవకాశం.

హైదరాబాద్‌: మైలార్ దేవ్ పల్లి లో కార్డన్ సర్చ్. 50 మంది పోలీసు బలగాలతో అర్ధరాత్రి కొనసాగిన సర్చ్ ఆపరేషన్. శాస్త్రీపూరం, అక్బర్ కాలనీ, ఒట్టేపల్లి, మహమ్మదీయా కాలనీ, ఒవైసీ కాలనీ లో పోలీసుల తనిఖీలు. ఓ ఆటో నిండా నిషేధిత గుట్కా ప్యాకెట్స్ గుర్తింపు. ఆటో తో పాటు గుట్కా సీజ్. షేక్ మహ్మద్ అనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు.

సంగారెడ్డి: నేడు సంగారెడ్డి జిల్లా జెడ్పి సర్వసభ్య సమావేశం. సమావేశానికి హాజరుకానున్న మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు.