1. చంద్రయాన్-3 తొలిదశ పరిశీలన విజయవంతం. ప్రజ్ఞాన్ రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి పంపిన ఇస్రో. డేటా పే లోడ్ ఆఫ్ చేసి పార్క్ అయిన ల్యాండర్. నేటి నుంచి చంద్రుడిపై కమ్ముకోనున్న చీకటి. ఈ నెల 22 తర్వాత రోవర్ మళ్ల పనిచేసే అవకాశం.
2. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,220 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,000 లుగా ఉంది.
3. నంద్యాల.. నేడు డోన్ లో సీపీఐ రామకృష్ణ బస్సుయాత్ర.
4. విజయవాడ : BRTS రోడ్డులో నేడు వైఎస్ విగ్రహ ఆవిష్కరణ. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం.
5. విజయవాడ : నేడు బెజవాడలో విద్యుత్ స్ట్రగుల్ కమిటీ సమావేశం. ఈ నెల 10న ఆందోళనకు సిద్ధమైన స్ట్రగుల్ కమిటీ.
6. విశాఖ… నేటి నుంచి ఈనెల 9 వరకు పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసిన వాల్తేర్ డివిజన్…. విజయవాడ సెక్షన్లో భద్రతాపరమైన నిర్మాణాలు కారణంగా రద్దైన రైళ్లు….
7. విశాఖ… నేడు,రేపు కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి శర్భానంద్ సోనోవాల్, సహాయ మంత్రి శ్రీపాద నాయక్ పర్యటన…. విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష. 333.56 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించనున్న మంత్రులు. రేపు ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ను ప్రారంభించనున్న శర్భానంద్ సోనోవాల్… 96.05 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ అంతర్జాతీయ క్రూయీజ్ టెర్మినల్ ను సంయుక్తంగా నిర్మించిన పోర్టు,టూరిజం శాఖలు.
8. విశాఖ.. నేడు నిరుద్యోగుల యూత్ మార్చ్… సరస్వతీపార్కు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగనున్న ర్యాలీ.. నిరుద్యోగం,స్టీల్ ప్లాంట్ ప్రయివేటీ కరణకు వ్యతిరేకంగా నిరసన..