అమరావతి: నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలతో భేటీ. హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు.
తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల. ఇవాళ్లి నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. మే చివరి వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం. జూన్ 30 వరకు మొదటి దశ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి.
ఐపీఎల్: నేడు రాజస్థాన్ vs ముంబై. జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్.
ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ. గుంటూరు పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని పిటిషన్.
ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ మరో క్వాష్ పిటిషన్. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.
నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీలో పొల్గొనున్న సీఎం. పారిశ్రామికవాడకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు.
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉత్తమ్, జూపల్లి పర్యటన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల పనులను పరిశీలించనున్న మంత్రులు.
నేడు రాజమండ్రిలో సీపీఐ నేత నారాయణ పర్యటన. పార్టీ నేతలతో సమావేశంకానున్న సీపీఐ నేత నారాయణ.
గ్రూప్-1పై TGPSC అప్పీల్ పిటిషన్‌పై నేడు విచారణ. మధ్యాహ్నం 2 .15 గంటలకు విచారించనున్న తెలంగాణ హైకోర్టు.
నేడు ఏపీలో 11 ఎంఎస్‌ఎంఈ పార్కుల ప్రారంభం. నెల్లూరు జిల్లా నారంపేటలో ప్రారంభించనున్న చంద్రబాబు. మరో 14 ఎస్‌ఎఫ్‌సీలు, 25 కొత్త ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన.
విజయవాడ: రెండు రోజుల ఏసీబీ కస్టడీకి విడదల గోపి. గోపిని నేడు, రేపు ప్రశ్నించనున్న ఏసీబీ అధికారులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్న ఏసీబీ. వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్టయిన విడదల గోపి.
కేసిరెడ్డి పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. ఏ8 చాణక్య కస్టడీ పటిషన్‌పై నేడు విచారణ. లిక్కర్ స్కాం కేసులు కేసిరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు.
నేడు సుప్రీంకోర్టులో పహల్గామ్ దాడి కేసు విచారణ. జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ పిల్.
నేడు, రేపు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన. నేడు, రేపు మహారాష్ట్ర, కేరళ, ఏపీలో మోడీ పర్యటన. రేపు ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న మోడీ.
