* ఇవాళ సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ కేసు విచారణ.. మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలపై రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించిన సూరత్ కోర్టు.. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టులో పిటిషన్ వేసిన రాహుల్ గాంధీ
* నేటి నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ..
* మొహాలీ: ఐపీఎల్‌లో నేడు గుజరాత్‌తో తలపడనున్న పంజాబ్.. రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం
* TSPSC పేపర్ లీకేజీ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ
* ప్రకాశం : మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న స్వామి వారు.
* అనంతపురం : బ్రహ్మసముద్రం మండల పిల్లలపల్లి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
* అనంతపురం జిల్లాలో నేటితో ముగియనున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. యాడికి మండలం చందన గ్రామం నుంచి నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న యాత్ర.
* నేడు విశాఖలో కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులుస్తే పర్యటన.. ఉదయం 10.30 గంటలకు పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్ గార్ మేళాకు హాజరుకానున్న మంత్రి.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో సమావేశం.. 3.45నిముషాలకు ఆర్.ఐ.ఎన్. ఎల్ కార్మిక సఘాలను ఆహ్వానించిన కేంద్ర మంత్రి
* 69వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర.. నేడు డోన్ అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాలజిల్లా)లో పాదయాత్ర.. రాయలచెరువు, చందన, దాయలమడుగు, నంద్యాల జిల్లా డి.రంగాపురం, నల్లమేకలపల్లి, రాంపురం క్రాస్, జక్కసానికుంట్ల మీదుగా పీఆర్ పల్లి వరకు సాగనున్న లోకేష్ పాదయాత్ర
* శ్రీకాకుళం: ఉదయం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం , ఎండోమెంట్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న శాసనసభాపతి తమ్మినేని సీతారాం.. మధ్యాహ్నం బూర్జ మండలం పాలవలస, ఆముదాలవలస మున్సిపాలిటి పరిధిలోని పార్వతీశంపేట వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రoలో పాల్గొంటారు
* శ్రీకాకుళం: నేడు పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు పర్యటన.. వజ్రపుకొత్తూరు మండలం సుంకర జగన్నాధపురం పంచాయతీ లో గడప గడపకు మన ప్రభుత్వం మరియు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారు.
* ఏలూరు: నేడు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం.. హాజరుకానున్న జిల్లా ఇంఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్.. పేదలందరికి ఇళ్లు, ఉపాధిహామీ – ప్రాధాన్యత భవనాలు, నాడు-నేడుతో పాటు వివిధ అంశాలపై సమీక్ష.
* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాష్ట్ర హోం మంత్రి అధ్వర్యంలో కొవ్వూరు టౌన్ 12 వ వార్డ్ నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం..
* విజయనగరం: అయ్యన్నపేట కొత్తవాస ప్రాంతంలో ప్రాంతంలో నేడు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
* విజయనగరం మండలం కొండకరకం గ్రామంలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోవూరు మండలం పాటూరులో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు అనంతరం పొదలకూరు మండలంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు
* విజయనగరం: కొత్తపేట రాధాకృష్ణ జిల్లా యాదవ కళ్యాణ మండపంలో నేడు బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ వర్ధంతి కార్యక్రమం…
* నేటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర.. ప్యాపిలి మండలం డి.రంగాపురం లోకి ప్రవేశించనున్న పాదయాత్ర.. ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసిన టీడీపీ శ్రేణులు.. 30 రోజులు ఉమ్మడి జిల్లాలో కొనసాగనున్న పాదయాత్ర, ప్యాపిలిలో బహిరంగ సభ
* కర్నూలు: మంత్రాలయంలో నేడు శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి తుంగభద్ర జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు. సాయంత్రం నవరత్న స్వర్ణ రథంపై ప్రహ్లదరాయుడు అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ రాఘవేంద్రుడు.
* శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో తమిళనాడు నూతన సంవత్సర వేడుకలు.. తరలి వచ్చిన తమిళనాడు భక్తులు.
* మంచిర్యాల: రేపు జిల్లా లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ.. నస్పూర్ వద్ద సభ కోసం చకచకా కొనసాగుతున్న ఏర్పాట్లు.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే