Site icon NTV Telugu

Virat Kohli Century: కోహ్లీ 49వ సెంచరీపై సచిన్ ఏమన్నారంటే..?

Kohli Sachin

Kohli Sachin

ఈరోజు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. ఏ క్రికెటర్ సాధించలేని అరుదైన ఫీట్ ను కోహ్లీ సాధించి క్రికెట్ చరిత్రలోనే తన పేరును లిఖించుకున్నాడు. ఇదిలా ఉంటే సచిన్ 452 ఇన్నింగ్స్ ల్లో 49 శతకాలు బాదగా.. కోహ్లీ 277 ఇన్నింగ్స్ ల్లోనే 49 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 13626 పరుగులు చేశాడు. కోహ్లి సగటు 58.48 కాగా స్ట్రయిక్ రేట్ 93.55 ఉంది. అంతేకాకుండా.. అర్ధసెంచరీలను 70 చేశాడు. దీంతో క్రికెట్ దేవుడు సచిన్ సరసన సగర్వంగా నిలిచాడు.

IND vs SA: సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం.. సెంచరీతో అదరగొట్టిన కింగ్ కోహ్లీ

ఇదిలా ఉంటే.. కోహ్లీ ఈ ఘనత సాధించడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. విరాట్ పై అభినందనల వర్షం కురిపించాడు. బాగా ఆడావు అంటూ కితాబునిచ్చారు. ఈ రోజు విరాట్ బర్త్ డే విషయాన్ని ప్రస్తావిస్తూ చమత్కారంగా వ్యాఖ్యానించారు. “నేను 49 నుంచి 50 ఏళ్ల వయసుకు చేరుకునేందుకు 365 రోజులు పట్టింది… కానీ నువ్వు కొన్ని రోజుల్లోనే 49 నుంచి 50కి చేరుకోవాలని కోరుకుంటున్నాను… తద్వారా నా రికార్డు బద్దలు కొడతావని ఆశిస్తున్నాను” అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. కొందరు నెటిజన్లు మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్‌పై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Exit mobile version