* నేడు సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి
* నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం.. కార్మిక సంఘాలు, యాజమాన్యంకు సింగరేణి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆహ్వానం.. ఈ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం
* ప్రకాశం: దోర్నాల మండలం చిన్న దోర్నాలలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
* ప్రకాశం: ఒంగోలులో జిల్లా బీజేపీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి
* విశాఖ: నేడు మత్స్యకారుల ఇలవేల్పు గంగమ్మ తల్లి జాతర.. ఫిషింగ్ హార్బర్‌లో ప్రత్యేక పూజలు చేయనున్న మహిళలు.. రేపటితో ముగియనున్న సముద్రంపై చేపల వేట నిషేధం.. రేపటి నుంచి వేటకు వెళ్లనున్న బోట్లు
* నెల్లూరు: వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి
* విజయవాడ: నేటి నుంచి పని చేయనున్న ఏపీ హైకోర్టు
* కాకినాడ: వారాహి యాత్రకు నేడు అన్నవరం చేరుకోనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రత్నగిరి కొండపై భక్తుల రద్దీ దృష్ట్యా సత్యగిరి కొండపై పల్లవి గెస్ట్ హౌస్‌లో రాత్రికి పవన్ బస.. రేపు ఉదయం సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు.. రేపు సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభ
* విశాఖ: విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి రాజీవ్ రంజాన్ పర్యటన.. రోజ్‌గార్ మేళాను ప్రారంభించనున్న మంత్రి