Gangs of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించాడు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ మాస్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది .
Read Also :Shraddha Kapoor : అలా చేస్తే ప్రభాస్ తో మరోసారి నటిస్తా..
అలాగే సినిమాను తన అద్భుతమైన టేకింగ్ తో దర్శకుడు కృష్ణ చైతన్య అద్భుతంగా తెరకెక్కించాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.సోమవారం నాటికీ ఈసినిమా లాభాల్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.ఈ సినిమా ఈ మూడు రోజులలో 14 కోట్ల వరకు గ్రాస్ ,6.62 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.దీనితో ఈ సినిమా మొదటి వారంలోనే లాభాలలోకి అడుగు పెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయ్యేనాటికి భారీగా కలెక్షన్స్ సాదిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా వుంది.