NTV Telugu Site icon

Jawahar Point: చంద్రుడిపై జవహర్‌ పాయింట్.. రాజుకున్న రాజకీయ వివాదం

Jawahar Point

Jawahar Point

Jawahar Point: చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో నేడు ప్రపంచం మొత్తం భారతీయ శాస్త్రవేత్తలను కొనియాడుతోంది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి వెళ్లి శాస్త్రవేత్తలను అభినందించి తదుపరి మిషన్‌ను ప్రోత్సహించారు.

శివశక్తి పాయింట్ అంటే ఏమిటి?
ప్రధాని మోదీ తన ప్రసంగంలో చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్‌కు పేరు పెట్టారు. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ‘శివశక్తి పాయింట్’గా పిలుస్తామని ప్రధాని చెప్పారు.

తిరంగా పాయింట్ అంటే తెలుసా?
దీనితో పాటు చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ జరిగిన ప్రదేశానికి కూడా ప్రధాని మోడీ పేరు పెట్టారు. చంద్రయాన్-2 చంద్రుడి ఉపరితలాన్ని తాకిన ప్రదేశానికి ‘తిరంగా పాయింట్’ అని పేరు పెట్టారు. అంతే కాకుండా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన ప్రకటించారు.

Read Also: Amit Shah: దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని మోడీ కొత్త వేగం, శక్తిని అందించారు..

చంద్రునిపై జవహర్ పాయింట్ అంటే ఏమిటి?
ల్యాండింగ్ సైట్ పేరు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చంద్రయాన్-1 ల్యాండింగ్ సైట్ పేరు పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి చంద్రుని మిషన్ చంద్రయాన్-1 అక్టోబర్ 22, 2008న పీఎస్‌ఎల్వీ రాకెట్ సహాయంతో ప్రయోగించబడింది. చంద్రయాన్-1 నవంబర్ 14, 2008న చంద్రుని ఉపరితలంపై క్రాష్-ల్యాండ్ అయింది. చంద్రయాన్-1 క్రాష్ ల్యాండింగ్ జరిగిన ప్రదేశానికి జవహర్ పాయింట్ అని పేరు పెట్టారు.

జవహర్ పాయింట్‌కి అలా ఎందుకు పేరు పెట్టారు?
చంద్రయాన్-1 చంద్రుని ఉపరితలాన్ని తాకిన రోజు నవంబర్ 14, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు కాబట్టి చంద్రయాన్-1 క్రాష్ ల్యాండింగ్ సైట్‌కు జవహర్ పాయింట్ అని పేరు పెట్టారు. అందుకే ఆ ప్రదేశాన్ని జవహర్ పాయింట్ అని పిలిచేవారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని తరువాత ఈ ప్రదేశం జవహర్ పాయింట్‌గా పిలువబడింది.

Read Also: Chandrayaan-3: శివశక్తి పాయింట్‌ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు.. వీడియోను షేర్‌ చేసిన ఇస్రో

చంద్రయాన్-1 కీలక సమాచారాన్ని సేకరించింది..
చంద్రయాన్-1 సహాయంతో భారత్ చంద్రునిపై తన ఉనికిని నమోదు చేసింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఈ మిషన్ నుండి అనేక రకాల సమాచారాన్ని సేకరించింది. ఈ మిషన్‌తో ఇస్రో చంద్రునిపై నీటిని గుర్తించింది. ఇది చాలా ముఖ్యమైనది. చంద్రయాన్-1 చంద్రుని కక్ష్యలోకి నవంబర్ 8, 2008న ప్రవేశించింది. ఆగస్టు 29, 2009న ఆర్బిటర్‌తో సంబంధాన్ని కోల్పోయింది.

నామకరణంపై రాజకీయ దుమారం
జవహర్ పాయింట్ పేరు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం మొదలైంది. బీజేపీ నాయకుడు షాజాద్ పూనావాలా దీనిపై కాంగ్రెస్‌ను ట్విటర్‌లో టార్గెట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశం మీద భక్తితో ల్యాండింగ్ పాయింట్ పేర్లను తిరంగా పాయింట్, శివశక్తి పాయింట్ అని పేర్లు పెట్టిందని ఆయన అన్నారు. విక్రమ్ సారాభాయ్ తర్వాత ల్యాండర్‌ను విక్రమ్ ల్యాండర్ అని పిలుస్తారన్నారు. 2008లో చంద్రయాన్‌-1 ల్యాండింగ్ పాయింట్‌ పేరును జవహర్‌ పాయింట్ అని పేరు పెట్టింజదని షాజాద్ పూనావాలా ట్విటర్‌లో తెలిపారు. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండి ఉంటే.. చంద్రయాన్-2, చంద్రయాన్-3లను పంపి ఉంటే వాటికి ఇందిరా పాయింట్, రాజీవ్ పాయింట్ అని పేర్లు పెట్టేవారని బీజేపీ నేత అన్నారు. బీజేపీ నేత ట్వీట్‌తో ప్రస్తుతం రాజకీయ వివాదం మొదలైంది.