Google: గూగుల్ ప్రవేశపెట్టబోతున్న ప్రాజెక్ట్ ఆస్ట్రా అంటే ఏమిటో? తెలుసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ సంస్థ మరో కొత్త ఫూచర్ ను తీసుకురాబోతోంది. ఇది వినియోగదారులకు మరింత నచ్చుతుందని గూగుల్ పేర్కొంది. ప్రాజెక్ట్ ఆస్ట్రా, గూగుల్ కొత్త మల్టీమోడల్ ఏఐ (AI) అసిస్టెంట్. ఈ సంవత్సరం గూగుల్ I/O తో, ఆండ్రాయిడ్ కంపెనీ, వర్క్‌స్పేస్, ఫోటోలు, ఇతర యాప్‌లలో సేవల కోసం ఏఐ ప్రయత్నాలు, మోడల్‌లు, ఫీచర్‌లను ప్రదర్శించింది. అయితే, ఈ కార్యక్రమం సందర్భంగా.. కంపెనీ “ప్రాజెక్ట్ ఆస్ట్రా” అనే సరికొత్త ఏఐ ఏజెంట్‌ను ప్రకటించింది. ఇది కెమెరా ఆధారిత చాట్‌బాట్. ఇది రోజువారీ జీవితంలో ఉపయోగపడుతుంది. గూగుల్ డీప్‌మైండ్ CEO డెమిస్ హస్సాబిస్.. మల్టీమోడల్ ఏఐ అసిస్టెంట్ నిజ-సమయ, ప్రారంభ వెర్షన్ ఎలా పని చేస్తుందో రీకోడ్ చేసిన డెమో వీడియోను ప్రదర్శించారు. ప్రాజెక్ట్ ఆస్ట్రా అంటే ఏమిటి.. అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. కెమెరా లెన్స్ ద్వారా ప్రపంచాన్ని చూడగలిగే మల్టీమోడల్ AI అసిస్టెంట్ అయిన ప్రాజెక్ట్ ఆస్ట్రా ప్రారంభ వెర్షన్‌తో ఏఐ సహాయకుల భవిష్యత్తును గూగుల్ (Google) ప్రదర్శించింది. కొత్త ఏఐ ఏజెంట్ శక్తివంతమైనది. జెమిని ఏఐ మోడల్ ప్రస్తుత వెర్షన్ కంటే అధునాతనమైనది. ఏఐ ఏజెంట్ దాని అధునాతన సామర్థ్యాలతో “యూనివర్సల్ అసిస్టెంట్” కావాలని తాను కోరుకుంటున్నట్లు హస్సాబిస్ హైలైట్ తెలిపారు.
READ MORE: Attack on Couple: పెంపుడు కుక్క విసిగిస్తోందని దంపతులపై దాడి.. హైదరాబాద్ లో ఘటన
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
కెమెరా వ్యూఫైండర్ సహాయంతో ఏఐ చాట్‌బాట్ మనుషుల లాగానే తన ముందు ఉంచిన వస్తువుల గురించి తెలియజేస్తుంది. వాటి గురించి పలు విషయాలు తెలుపుతుంది. టెక్స్ట్, ఆడియో, వీడియోల ద్వారా వినియోగదారులు అడిగే ప్రశ్నలకు ప్రాజెక్ట్ ఆస్ట్రా సమాధానం తెలుపుతుంది. ముందే రికార్డ్ చేసిన వీడియో డెమోలో ప్రదర్శించినట్లుగా.. ఇది మనుషుల లాగానే మాట్లాడుతుంది. కొన్ని ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇవ్వగలదు. AI ఏజెంట్‌కు అవగాహన, గ్రహణశక్తి, స్థాన అవగాహన లాంటి పలు నైపుణ్యాలు ఉన్నాయి. ఇది వినియోగదారు పరిసరాలకు సమీపంలో ఉన్న వస్తువులను సులభంగా గుర్తించగలదు. వీడియో ద్వారా అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతుంది. గదిలో తప్పిపోయిన వస్తువులను కూడా కనుగొనవచ్చు. గూగుల్ సీఈవో హస్సాబిస్ మాట్లాడుతూ.. “ ఈ ప్రాజెక్ట్ వినియోగదారులు చాలా ఉపయోగ పడుతుంది. ఒక ఏజెంట్ నిజంగా ఉపయోగకరంగా ఉండాలంటే వ్యక్తుల మాదిరిగానే సంక్లిష్టం, చైతన్యవంతంగా ఉండాలి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతిస్పందించాలి.. సందర్భాన్ని అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాలి. వస్తువులను గుర్తించాలి.” అని పేర్కొన్నారు.
- Tags
- AI
- ceo of google
- demo video
- I/O
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!