శరీరంలోని అన్ని విటమిన్లు తగిన మోతాదులో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ విటమిన్ లోపం ఉన్నా ఆ ప్రభావం మన శరీరంపై పడుతుంది. అందులో ఒకటైన బి12 (Cobalamin) విటమిన్ లోపిస్తే.. జరిగే పరిణామాలను ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుత వేసవిలో మన శరీరం అనేక మర్పులకు గురవుతోంది. బి12 (Cobalamin) విటమిన్ లోపిస్తే.. నాలుక, నోటిలో పుండ్లు ఏర్పడతాయి. ఈ పుండ్లు విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. వేసవిలో ఈ పుండ్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. శరీరం వేడి, ఆహారం వేడిగా తీసుకోవడం వల్ల ఈ పుండు ఏర్పడుతుంది. ఇదే కాకుండా శరీరంలో విటమిన్లు లేనప్పుడు కూడా ఈ పుండు కనిపిస్తుంది. ఈ పుండునే అల్సర్లు అని కూడా అంటారు. ఈ విటమిన్ B12 మన న్యూరాన్లు, రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ మన శరీరానికి ఈ విటమిన్ బి12ను స్వతంత్రంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. మనకు ఈ విటమిన్ అవసరమైతే, కూరగాయలు, పండ్లతో సహా కొన్ని ఆహారాలు తినడం ద్వారా పొందవచ్చు. విటమిన్ B12 (Cobalamin) లోపం అసాధారణంగా పెద్ద ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కారణమవుతుంది. అవి సరిగ్గా పనిచేయవు. రక్తహీనతకు దారితీస్తుంది. ఇది పరోక్షంగా నోరు, నాలుక పుండ్లకు దారితీస్తుంది.
READ MORE:Need Lover: లవర్ కోసం వెదుకుతున్న 70 ఏళ్ల వృద్ధుడు.. కండిషన్స్ కూడా సుమీ..
ఈ విటమిన్ ఎక్కడ లభిస్తుందంటే.. విటమిన్ B12 మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి ఉత్పత్తులలో లభిస్తుంది. కొన్ని తృణధాన్యాలు, రొట్టెలలో కూడా ఈ విటమిన్ దాగి ఉంటుంది. బి12(Cobalamin) లోపం ఉన్న వాళ్లు తరచూ పైన ఈ రకాలైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. విటమిన్ బి12 (Cobalamin) తక్కువగా ఉందని మన శరీరానికి ముందే తెలుస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ విటమిన్ లోపాన్ని మనం గమనించవచ్చు. ఇది లోపించడంతో ఏకాగ్రత కష్టతరం చేస్తుంది. నరాల దెబ్బతినడం ప్రారంభమవుతోంది. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.