Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ గేమ్ ఛేంజర్ “.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ గత మూడేళ్ళ నుంచి జరుగుతూనే వుంది కానీ కంప్లీట్ కాలేదు. దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడం లేదు.
Read Also :Maname Movie Review: మనమే మూవీ రివ్యూ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మే 9 న విడుదల కావాల్సి వుంది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ జూన్ 27 న రిలీజ్ కానుంది.అలాగే అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.కానీ ఆగస్టు 15 న రిలీజ్ కానుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.అలాగే ఎన్టీఆర్ దేవర దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది.దీనితో పెద్ద సినిమాల రిలీజ్ లపై ఓ క్లారిటీ వుంది.కానీ రాంచరణ్ సినిమా రిలీజ్ పై క్లారిటీ లేదు.దీనితో ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.దీనితో గేమ్ చేంజెర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.