NTV Telugu Site icon

Delhi Metro: మెట్రో రైలులో ఇవేం పనులు తమ్ముళ్లు.. అరాచకానికి పరాకాష్టలా తయారయ్యారు..!

Metro

Metro

Delhi Metro: రోజు రోజుకు యువత చెలరేగిపోతున్నారు. పైశాచిక ఆనందం కోసం వింత వింత చేష్టలు, న్యూసెన్స్ లకు పాల్పడుతున్నారు. అలా అని వారు చేసే వీడియోల్లో ఎవరికైనా ఉపయోగముందా. పక్కవారికి ఇబ్బందులు తప్పా. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఎంతటి దానికైనా దిగజారుతున్నారు యువత. మొన్నటికి మొన్న కారుపై పుషప్ లు చేయడం, రైళుకు ఎదురెల్లి స్టంట్ లు చేయడం, ఇలా చెప్పుకుంటే పోతే బోలెడన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Read Also: Karnataka: ప్రభుత్వ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణం.. కండక్టర్‌గా మారనున్న సీఎం

ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువకుడు ట్రైన్‌ డోర్‌ను కాళ్లతో అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనాలు, కాంప్లెక్స్‌లతో లిఫ్ట్‌ మాదిరిగానే ఆటోమేటిక్‌ డోర్‌ సిస్టమ్‌ మెట్రో ట్రైన్‌లోనూ ఉంటుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయడానికి మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది. అయితే ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు ఆకతాయి యువకులు రూల్స్ ను బ్రేక్ చేశారు. ట్రైన్‌ కదిలేముందు డోర్లు క్లోజ్ అవుతుండగా.. క్లోజ్‌ అవ్వకుండా కాళ్లతో అడ్డుకుంటున్నారు. ఈ సంఘటనను వీడియో తీసిన కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Read Also: Godavari: గోదావరి నదికి సీఎం కేసీఆర్ ప్రత్యేక హారతి

ఈ వీడియోలో గమినిస్తే ఇద్దరు యువకులు మెట్రో రైలు తలుపుల దగ్గర నిలబడి ఉన్నారు. అప్పుడు రైలు డోర్ మూసేయడానికి ప్రయత్నించినప్పుడు.. యువకులు తమ కాళ్ళను అడ్డంగా ఉంచి, తలుపు మూసివేయడానికి లేకుండా అడ్డుకున్నారు. మెట్రో రైళ్లలో ఆటోమేటిక్ డోర్ల మధ్యలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే వెంటనే తెరుచుకుంటాయి. ఈ వీడియోలో యువకులు కాళ్లతో తలుపు మూయకుండా ఆపుతున్నారు. ఈ సమయంలో వారి స్నేహితులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఢిల్లీ మెట్రో అథారిటీ ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేశారు.

Read Also: AP Special Category Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ ట్వీట్‌కు స్పందించిన ఢిల్లీ మెట్రో అడ్మినిస్ట్రేషన్.. ఇలా చేయడం శిక్షార్హమైన నేరమని, ఎవరైనా యువకులు మెట్రో ట్రైన్లలో ఇలాంటి చర్యలకు పాల్పడితే హెల్ప్‌లైన్ నంబర్ 155370కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. ట్రైన్‌లో ఇలా ప్రవర్తిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులకు కలిగించడంపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఈ వీడియోలో ఉన్న యువకులు పట్టుబడితే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.