ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు చిత్తుగా ఓడింది. దీంతో టీమిండియాలోని పలువురు ఆటగాళ్లపై ఈ ఓటమి ప్రభావం గట్టిగానే పడేట్టుంది. టెస్టులలో కీలక ఆటగాళ్లైన నయా వాల్ ఛటేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్ లపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుగబోయే విండీస్ సిరీస్‌లో వీళ్లిద్దరినీ టీమ్ యాజమాన్యం తప్పించనున్నట్టు సమాచారం.
Also Read : Centrol Govt: భారత్ లో ట్విట్టర్ మూసివేతపై కేంద్రం క్లారిటీ..
తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ లో పుజారాపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 50 పరుగులు కూడా చేయలేదు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పుజారాను తప్పించి కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపించాయి. పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్ కెరీర్ కు కూడా ఎండ్ కార్డ్ పడ్డట్టే కనబడుతుంది. ఫామ్ కోల్పోయి భారత జట్టుకు చాలాకాలంగా దూరంగా ఉన్న ఉమేశ్.. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఏమాత్రం తన బౌలింగ్ ప్రభావం చూపించలేక పోయాడు. ఈ మ్యాచ్ కు అశ్విన్ ను తప్పించి ఉమేశ్ ను ఎంపిక చేసినా అతడు బౌన్సీ వికెట్ పై అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు.
Also Read : Migration to BJP: బీజేపీలోకి మళ్లీ మొదలైన వలసలు.. కాషాయ గూటికి మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి..?
ఉమేష్, పూజారనే గాక వికెట్ కీపర్ కేఎస్ భరత్ పై కూడా వేటు పడే ఛాన్స్ ఉంది. రిషభ్ పంత్ గాయపడటంతో అతడి స్థానంలో టీమ్ లోకి వచ్చిన భరత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ ఆంధ్రా కుర్రాడు.. ఆడిన నాలుగు టెస్టులలో కేవలం 129 పరుగులే చేశాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ లో కేఎస్ భరత్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో విండీస్ టూర్ లో ఇతడిని కూడా పక్కనబెట్టి ఇషాన్ కిషన్ ను టెస్టులలో ఆడించే అవకాశాలున్నట్టు బోర్డు వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Also Read : Nandamuri Balakrishna: మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతికి బాలయ్య సంతాపం
పుజారా, ఉమేశ్, భరత్ పై వేటు వేసి ఐపీఎల్ తో పాటు దేశవాళీలో మెరుస్తున్న యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ లతో పాటు పంజాబ్ కింగ్స్ తరఫున మెరుపులు మెరిపించిన యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా ఛాన్స్ దక్కొచ్చని తెలుస్తున్నది. త్వరలో విండీస్ టూర్ కు భారత జట్టును ప్రకటించే ఛాన్స్ ఉండటంతో దీనిపై క్లారిటీ రానుంది.