Even Mohammed Shami made a late entry, he made the latest entry: వన్డే వరల్డ్‌కప్ 2023లో టీమిండియా సీనియర్ పేసర్ ‘మహ్మద్ షమీ’ లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మెగా టోర్నీలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఏకంగా 14 వికెట్స్ పడగొట్టాడు. న్యూజీలాండ్, శ్రీలంకలపై ఐదేసి వికెట్స్ పడగొట్టిన షమీ.. ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్స్ తీశాడు. ఈ మూడు మ్యాచ్‌లలో సంచలన బౌలింగ్‌తో జట్టుకు సునాయాస విజయాలు అందించాడు. షమీ బౌలింగ్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘షమీ సూపరో సూపర్’,’లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వన్డే వరల్డ్‌కప్ 2023లో టీమిండియా ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా.. అందులో చివరి మూడు మ్యాచ్‌లలో మహమ్మద్ షమీ ఆడాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో జట్టు కూర్పులో మార్పులు చేయగా.. షమీకి అవకాశం దక్కింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్స్ పడగొట్టి తాను ఎంత విలువైన బౌలరో చాటిచెప్పాడు. రెండో మ్యాచ్‌లో 4 వికెట్స్ తీసిన షమీ.. మూడో మ్యాచ్‌లో మరోసారి 5 వికెట్స్ పడగొట్టాడు. దాంతో వరల్డ్‌కప్ 2023లో అత్యధిక వికెట్స్ తీసిన ఆరో బౌలర్‌గా నిలిచాడు. 7 మ్యాచ్‌లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్స్ పడగొట్టి ఐదవ స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో దిల్షాన్ మధుశంక (18) ఉన్నాడు. షమీ ఇదే ఫామ్ కొనసాగిస్తే లీగ్ దశ ముగిసే లోపు అగ్రస్థానంలోకి దూసుకొస్తాడు.
Also Read: BCCI-Team India: బీసీసీఐ చీటింగ్.. భారత జట్టుకు స్పెషల్ బాల్స్ ఇస్తోంది! అందుకే వరుస విజయాలు
వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ 5 వికెట్స్ పడగొట్టడంతో ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లలో 45 వికెట్లతో మాజీ పేసర్లు జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్‌లను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. భారత్ తరపున ప్రపంచకప్‌లో జహీర్, శ్రీనాథ్ చెరో 44 వికెట్లు తీశారు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ (71) ఉన్నాడు.