Tamil Nadu: చేపలకని వల వేశారు.. మత్స్యకారులకు ఊహించని షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్ తగిలింది. జాలర్ల వలకు 38.6కిలోల బరువున్న తిమింగళం వాంతి చిక్కింది. దీని ధర మార్కెట్లో 50కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.. తమిళనాడులోని కల్పాక్కం సమీపంలో తిమింగలం వాంతి లభ్యమయ్యింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగల్పట్టు జిల్లా కడపాక్కం సమీపంలోని కడకుప్పం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్లు చేపల వేట కోసం కొద్ది రోజుల కిందట సముద్రంలోకి వెళ్లారు. నడి సముద్రంలో వారు విసిరిన వల బరువుగా అనిపించడంతో భారీ చేప చిక్కిందని భావించారు. పైకి లాగే సరికి అందులో చేపకు బదులు మరేదో ఉండటంతో నిశితంగా గమనించారు. చివరకు అది తిమింగలం వాంతిగా గుర్తించి ఈ విషయం గురించి అరుచ్చిపాక్కం అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు.
తిమింగలం వాంతి స్పెర్మ్ వేల్స్ జీర్ణవ్యవస్థలో ఉత్పత్తి అవుతుంది. ఇది తిమింగలం యొక్క ప్రేగులలో తయారైన మైనపు, ఘన, మండే పదార్థం అని చెబుతున్నారు. ఎంతో విలువైన తిమింగలం వాంతిని సముద్రంలో తేలే బంగారం అంటారు. తిమింగలం వాంతికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అరుదైన స్పెర్మ్ తిమింగలాల పొట్టలో మాత్రమే ఇది తయారవుతుంది. ఆ తిమింగలాలు స్క్విడ్ ని మింగుతాయి. అవి దాని పొట్టలోకి వెళ్లిన తర్వాత ఆంబ్రెయిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దాంతో స్క్విడ్ ముక్కలై ముద్దలా మారిపోతుంది. ఆ సమయంలో తిమింగలం దాన్ని కక్కితే… అదే వాంతిగా నీటిపై తేలుతుంది. నీటిలో ఉన్నా అది క్రమంగా గట్టిపడి కొవ్వొత్తిలా మారిపోతుంది. అలా మారిన దాన్ని అంబెర్‌గ్రిస్ అంటారు.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
Read Also: Tiruchi Gold: అండర్ వేర్ ఐడియా బాగుంది.. కానీ అధికారులు పట్టేశారుగా..
పురాతన కాలం నుండి, తిమింగలం వాంతిని సువాసనలు, అత్యాధునిక పరిమళ ద్రవ్యాలలో, అలాగే వివిధ సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తారు. అందుకే దీనిని చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. గత సంవత్సరం ముంబై పోలీసులు ఇచ్చిన అంచనాల ప్రకారం, 1 కిలో తిమింగలం వాంతి విలువ 1 కోటి రూపాయలు . ఈ కారణంగా, సముద్రంలో ఈ విసర్జనను ” ఫ్లోటింగ్ గోల్డ్”గా సూచిస్తారు. ఈజిప్షియన్లు దీనిని ధూపం వలె ఉపయోగిస్తారు. చైనీయులు దీని డ్రాగన్ స్పిటిల్ సెంట్ గా వ్యవహరిస్తుంటారు. ఈ వాంతిని కాల్చినప్పుడు… ముందుగా చెడువాసన వస్తుంది… కాసేపటికి తియ్యటి వాసనగా అది మారుతుంది. థాయ్‌లాండ్ సహా పలు దేశాలకు చెందిన మత్స్యకారులు తిమింగలం వాంతితో కోటీశ్వరులైన ఘటనలు ఉన్నాయి.
- Tags
- ambergris
- Fisherman
- NET
- Tamil Nadu
- whale
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!