Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story West Bengal Exit Polls 2026 Mamata Bjp Battle Evm Row

Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?

Published Date :May 1, 2026 , 4:47 pm
By Venu Goapl Reddy
  • బెంగాల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..
  • సీఎం మమతా బెనర్జీ తీరు ఓటమిని తెలియజేస్తుందా.?
  • ఉరుకులు పరుగులు, విమర్శలు టీఎంసీ ఓటమిని సూచిస్తున్నాయా..
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీకు ఎన్నికలు ముగిశాయి. అయితే, అందరి చూపు మాత్రం బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపైనే ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మళ్లీ అధికారంలోకి వస్తుందా.? లేక బీజేపీ దీదీ కంచుకోటల్ని బద్దలుకోడుతుందా? అని అంతా మాట్లాడుకుంటుున్నారు. అయితే, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ సునామీ ఈ సారి బెంగాల్‌లో కనిపిస్తుందని అంచనా వేస్తున్నాయి. ఒకటి రెండు మినహా అన్ని ప్రముఖ ఎగ్జిట్ పోల్ సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు.

భవానీపూర్‌లో ఉరుకులు పరుగులు

Also Read

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
  • West Bengal elections: బెంగాల్‌లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
  • Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
  • NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?

ఇదిలా ఉంటే, ఎప్పుడూ లేని విధంగా మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో హైరానా పడుతున్నారు. రెండో దశలో జరిగిన ఎన్నికల్లో భవానీపూర్ నుంచి ఆమె బరిలోకి దిగారు. ఇదే స్థానం నుంచి బీజేపీ కీలక నేత, 2021లో నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి ఆమెపై పోటీకి నిలుచున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎన్నికల రోజు పార్టీ కార్యలయం నుంచి పరిస్థితిని మానిటరింగ్ చేస్తుంటారు. కానీ, మమతా బెనర్జీ మాత్రం భవానీపూర్‌లో పలు పోలింగ్ కేంద్రాలకు ఉరుకులు పరుగులు పెట్టింది. కేంద్రం, కేంద్ర బలగాలపై విమర్శలు గుప్పించింది. గతంలో మూడుసార్లు గెలిచిన దీదీ ఇలా ఎప్పుడూ కంగారు పడటం చూడలేదు.

ఈవీఎంలపై కన్నేయాలని సూచన

ఇక ఎన్నికలు ముగిసిన ఒక రోజు తర్వాత ఎగ్జిట్ పోల్స్‌పై ఆమె మండిపడుతూ 9 నిమిషాల వీడియో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తాము 220కి పైగా స్థానాల్లో గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఈవీఎంలపై నిఘా వేయాలని తన పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించింది. బీజేపీ, కేంద్ర బలగాలు ఫలితాన్ని మార్చాలని చూస్తున్నాయని మండిపడింది. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయని, ఎగ్జిట్ పోల్స్ బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటున్నాయని ఆరోపించారు. అయితే, ప్రతీ సందర్భంలో ఆమె బాడీ లాంగ్వేజ్ లో ఒక నిరాశ కనిపిస్తోంది.

అర్ధరాత్రి హై డ్రామా

ఇదిలా ఉంటే, గురువారం సాయంత్రం కోల్‌కతాలో ఒక ఈవీఎం సెంటర్ వద్ద టీఎంసీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని టీఎంసీ ఆరోపించారు. దీంతో, సీఎం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి గంటల తరబడి అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. దీంతో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

ఆఖరి రాగం పాడేసినట్లేనా

మమతా బెనర్జీ గతంలో మూడు సార్లు కూడా ఇదే ఈవీఎంలతో గెలించింది. కానీ ఇప్పుడు ఈవీఎంలు, కేంద్ర ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తోంది. దీనిని బట్టి చూస్తే మమతా ఆఖరి రాగం పాడేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితాలు ఎక్కడో తేడా కొడుతున్నా్యి కాబట్టే, దీదీ ఇలాంటి పనులు చేస్తోందని వారు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నిజమైన ఫలితాలు తెలియాలంటే మే 4 వరకు ఓపిక పట్టాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengal exit polls
  • BJP vs TMC Bengal
  • EVM controversy Kolkata
  • Indian elections 2026
  • Mamata Banerjee news

తాజావార్తలు

  • SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..

  • Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!

  • Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..

  • Gutti Vankaya Recipe : కుక్కర్‌లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!

  • Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions