Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..
Bengal Election Results Live Updates: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు, మే 4న రాష్ట్రంలోని 294 స్థానాలకు (ఫల్తా మినహా 293 స్థానాలకు) ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండగా, ఆమెపై బీజేపీ తరపున సువేందు అధికారి, కాంగ్రెస్ నుంచి ప్రదీప్ ప్రసాద్, సీపీఎం నుంచి శ్రీజీబ్ బిస్వాస్ పోటీ పడుతున్నారు. ఈ ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్‌డెట్స్ మీకోసం..
Also Read
- Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
- Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్‌డేట్స్..
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
- Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత.. పెళ్లిపై తమన్నా క్లారిటీ..
-
04 May 2026 09:07 AM (IST)
తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, టీఎంసీ 100 మార్కును దాటాయి
తొలి ట్రెండ్‌లు వెలువడుతుండటంతో బీజేపీ 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 100 స్థానాల్లో ముందంజలో ఉంది.
-
04 May 2026 09:02 AM (IST)
ఈ నియోజకవర్గాల్లో టీఎంసీ ముందంజ..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ వేగం పుంజుకోవడంతో తొలి ఫలితాల ట్రెండ్స్ బయటకు వస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, బగ్నాన్ (Bagnan), అమ్తా (Amta) నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఆధిక్యంలో కొనసాగుతోంది. వీటితో పాటు బోల్పూర్, చాంచల్, సుజాపూర్, రతువా నియోజకవర్గాల్లోనూ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
-
04 May 2026 08:56 AM (IST)
బీజేపీ భారీ నాయకుడు అర్జున్ సింగ్ ఆధిక్యం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని నోవాపారా (Noapara) నియోజకవర్గంలో బీజేపీ భారీ నాయకుడు అర్జున్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గం నిన్నటి నుంచే వార్తల్లో నిలిచింది. దత్తపుకూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన వందలాది వివిప్యాట్ (VVPAT) స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండటం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌కు సంబంధించినవే ఇవని భావించిన బీజేపీ, తృణమూల్, సీపీఎం పార్టీలు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించాయి. అయితే, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. రోడ్డుపై కనిపించిన ఆ స్లిప్పులు అసలు పోలింగ్‌కు సంబంధించినవి కావని, ఎన్నికలకు ముందు నిర్వహించిన మాక్ పోల్ (Mock Poll) లోనివని స్పష్టతనిచ్చింది. ఈ వివాదం నడుమ నేడు వెలువడుతున్న తొలి ట్రెండ్స్‌లో అర్జున్ సింగ్ ఆధిక్యం సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
04 May 2026 08:44 AM (IST)
మాకు 168-174 సీట్లు వస్తాయి: బీజేపీ
మణిక్తలా అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తపస్ రాయ్ మాట్లాడుతూ, "నా అంచనా ప్రకారం, మాకు 168 నుంచి 174 సీట్లు వస్తాయి. ఈ ఎన్నికల్లో రక్తపాతం జరగకపోవడం, ఏ మృతదేహం దొరకకపోవడం, ఎవరి రక్తమూ చిందించకపోవడం వాళ్లకు (టీఎంసీకి) నచ్చలేదు" అని అన్నారు.
#WATCH | West Bengal Assembly Elections 2026 | Kolkata: BJP Candidate from Maniktala Assembly Constituency Tapas Roy says, "According to my conservative assessment, we will get 168 to 174 seats. They (TMC) do not like the fact that there was no bloodshed in this election, no dead… pic.twitter.com/6rqKARRuYQ
— ANI (@ANI) May 4, 2026
-
04 May 2026 08:37 AM (IST)
ఖాతా తెరవని కాంగ్రెస్..
ఈసారి పశ్చిమ బెంగాల్‌లో మార్పు ఖాయమా? ట్రెండ్‌లు వెలువడటం ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 49 స్థానాలకు ట్రెండ్‌లు వెలువడగా, వాటిలో 29 స్థానాల్లో బీజేపీ, 20 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు, కాంగ్రెస్, వామపక్షాలు ఇంకా ట్రెండ్‌లలో తమ ఖాతా తెరవలేదు.
-
04 May 2026 08:35 AM (IST)
మమతా బెనర్జీ ఆధిక్యం..
పశ్చిమ బెంగాల్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి వెనుకబడ్డారు. రెజినగర్ స్థానంలో హుమాయున్ కబీర్ కూడా ఆధిక్యంలో ఉన్నారు.
-
04 May 2026 08:28 AM (IST)
హోరాహోరీ పోరు..
బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ మధ్య హోరాహోరీ పోరు. భవానీపూర్‌లో మమత ముందంజ
-
04 May 2026 08:18 AM (IST)
కౌంటింగ్ షురూ..
వెస్ట్ బెంగాల్‌లో కొనసాగుతున్న కౌంటింగ్. పలు చోట్ల ఉద్రిక్తత వాతావరణం. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.
-
04 May 2026 07:55 AM (IST)
విద్యుత్ అంతరాయం సమస్యపై ఈసీ స్పందన
పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి ముందు ఉదయం 6:30 గంటలకు భవానీపూర్‌లోని సఖావత్ మెమోరియల్ స్కూల్ వెలుపల టీఎంసీ, బీజేపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చెలరేగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని టీఎంసీ ఆరోపించింది. ఈ అంశంపై తాజాగా ఈసీ స్పందించింది. విద్యుత్ కోతల విషయం విద్యుత్ శాఖకు సంబంధించినదని ఎన్నికల సంఘం పేర్కొంది.
-
04 May 2026 07:54 AM (IST)
"మేము ఇక్కడికి యుద్ధం చేయడానికి రాలేదు" : డాక్టర్ శశి పాంజా
కౌంటింగ్ ప్రక్రియలో జరుగుతున్న గందరగోళంపై డాక్టర్ శశి పాంజా ఎన్నికల కమిషన్ తీరును తప్పుబట్టారు. ఓట్ల లెక్కింపును ట్రాక్ చేయడానికి తాము సిద్ధం చేసుకున్న పత్రాలను లెక్కచేయకుండా విసిరివేస్తున్నారని ఆమె ఆరోపించారు. అసలు ఇదంతా ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సిన పని అని, కానీ అక్కడ జరుగుతున్న తీరు సబబుగా లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. "మేము ఇక్కడికి యుద్ధం చేయడానికి వచ్చామా? మా దగ్గర ఏమైనా తుపాకులు, మందుగుండు సామాగ్రి ఉన్నాయా?" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం లెక్కింపు జరగాల్సింది పోయి, తాము తెచ్చుకున్న లెక్కల పత్రాలను విసిరివేయడం ఏంటని ఆమె అధికారులను నిలదీశారు.
-
04 May 2026 07:49 AM (IST)
కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండండి: మమతా బెనర్జీ పిలుపు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాత్రంతా మేల్కొని, నిశితంగా నిఘా ఉంచాలని ఆమె ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వస్తున్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా హుగ్లీ (శ్రీరాంపూర్), నదియా (కృష్ణానగర్), బర్ధమాన్ (ఆౌస్‌గ్రామ్) మరియు కోల్‌కతాలోని ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రం వంటి చోట్ల కావాలనే లోడ్ షెడ్డింగ్ (విద్యుత్ కోత) విధిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
-
04 May 2026 07:47 AM (IST)
బెంగాల్‌లో ఆసక్తికర సంప్రదాయం..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణలో "బెల్‌వెదర్ స్థానాలు" (Bellwether Seats) అత్యంత కీలకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 37 స్థానాలను నిపుణులు బెల్‌వెదర్ సీట్లుగా పరిగణిస్తారు. ఇవి కేవలం 13 శాతం స్థానాలే అయినప్పటికీ, బెంగాల్ రాజకీయ గమనాన్ని శాసించే శక్తి వీటికి ఉంది. 1977 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఒక ఆసక్తికరమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఈ 37 స్థానాల్లో ఏ పార్టీ అయితే మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందో, అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. అంటే, ఈ నియోజకవర్గాల తీర్పును బట్టే బెంగాల్‌ను పాలించేది ఎవరో ముందే అంచనా వేయవచ్చు. ఈ 37 సీట్లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వీటిలో జనరల్ స్థానాలతో పాటు ఎస్సీ (SC), ఎస్టీ (ST) రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందుకే, ఈ స్థానాల్లో లభించే ఆధిక్యం రాష్ట్రవ్యాప్త ఓటర్ల నాడికి ప్రతిబింబంగా నిలుస్తుంది. నేటి ఓట్ల లెక్కింపులో ఈ కీలక నియోజకవర్గాల ఫలితాలు ఎటు మొగ్గుతాయనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ బీజేపీ ఈ బెల్‌వెదర్ సీట్లలో తన పట్టు నిరూపించుకుంటే, మమతా బెనర్జీ కోట కూలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-
04 May 2026 07:38 AM (IST)
కౌంటింగ్‌కు సర్వ సిద్ధం: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్
ఇక, పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియపై ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. నిబంధనలకు లోబడి అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ కీలక బాధ్యతలను నిర్వహించే రిటర్నింగ్ అధికారులు (RO), సహాయ రిటర్నింగ్ అధికారులు (ARO), కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్లకు ఇప్పటికే పలుమార్లు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేసేందుకు 200 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) బలగాలను రంగంలోకి దించారు. అంతా పక్కాగా, నిబంధనల ప్రకారమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
-
04 May 2026 07:36 AM (IST)
సునామీ రాబోతోంది: అగ్నిమిత్ర పాల్.
బీజేపీ నేత, అసోన్ సోల్ సౌత్ నుంచి పోటీ చేస్తున్న అగ్నిమిత్ర పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో సునామీ రాబోతోందని, బెంగాల్ ఓటర్లు 92 శాతం ఓటింగ్ నమోదు చేశారని అన్నారు.
#WATCH | Asansol, West Bengal | BJP candidate from Asansol South Assembly constituency, Agnimitra Paul, says, "A tsunami is going to come. The people of Bengal have called for a tsunami by casting 92% votes, all leaders against this will fly away..." pic.twitter.com/J74RmsMxiB
— ANI (@ANI) May 4, 2026
-
04 May 2026 07:23 AM (IST)
సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం వస్తుంది: సువేందు అధికారి.
‘‘దేవుడు మాతో ఉన్నారు, సనాతన ధర్మ ప్రయోజనాలు రక్షించే ప్రభుత్వం వస్తుంది’’ అని బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు ఆయన కోల్‌కతాలోని లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఫల్తా నియోజకవర్గంలో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించడంపై టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ.. ఇది ఆయన అహంకారాన్ని చూపిస్తోందని, దేశంలో అంతిమంగా ప్రజాస్వామ్యం గెలుస్తుందని, ఇలాంటి పరిస్థితులే యూపీలో ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జంగిల్ రాజ్ అంతమైందని ఆయన అన్నారు.
#WATCH | Kolkata | West Bengal LoP and BJP candidate from Nandigram and Bhabanipur, Suvendu Adhikari, says, "... I offered prayers at the Lakshmi Narayan Temple. God is with us. A government that protects the interests of Sanatan Dharma is coming."
On TMC National General… pic.twitter.com/UyJqDOcHn0
— ANI (@ANI) May 4, 2026
-
04 May 2026 07:13 AM (IST)
మమతా బెనర్జీకి ఎందుకంత ప్రతిష్టాత్మకం?
భవానీపూర్ కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదు, అది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ అస్తిత్వానికి ప్రతీక. దక్షిణ కోల్‌కతా లోక్‌సభ స్థానంలో అంతర్భాగమైన ఈ నియోజకవర్గం ఆమెకు కంచుకోట వంటిది.
-
04 May 2026 07:13 AM (IST)
భవానీపూర్‌లో ఉద్రిక్తత..
భవానీపూర్‌లో కౌంటింగ్ కేంద్రం వెలుపల టీఎంసీ, బీజేపీ ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కౌంటింగ్ ఏజెంట్ల ఎంట్రీ విషయంలో చెలరేగిన వివాదం కాస్తా పరస్పర నినాదాలకు దారితీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
-
04 May 2026 07:07 AM (IST)
బీజేపీ జెండా పాతనుందా?
ప్రస్తుతం 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నానికి బెంగాల్ పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారనే దానిపై స్పష్టత రానుంది. మమతా బెనర్జీ తన హ్యాట్రిక్ అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేక బీజేపీ బెంగాల్ గడ్డపై తొలిసారి జెండా పాతనుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
-
04 May 2026 07:06 AM (IST)
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయంటే..?
ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. కొన్ని టీఎంసీకి మొగ్గు చూపగా, మరికొన్ని బీజేపీకి చారిత్రాత్మక విజయం ఖాయమని అంచనా వేస్తున్నాయి.
-
04 May 2026 07:06 AM (IST)
హై-ప్రొఫైల్ పోరు..
గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో తలపడిన మమతా బెనర్జీ, సువేందు అధికారి, ఈసారి భవానీపూర్‌లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.
-
04 May 2026 07:05 AM (IST)
మేజిక్ ఫిగర్ ఫిగర్ ఎంతంటే..?
బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 148 స్థానాలు అవసరం. గత 2021 ఎన్నికల్లో తృణమూల్ 215 స్థానాలతో ఘనవిజయం సాధించగా, బీజేపీ 77 స్థానాలకు పరిమితమైంది.
-
04 May 2026 07:03 AM (IST)
రికార్డు స్థాయిలో పోలింగ్..
ఇక, ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఈసారి బెంగాల్ ఎన్నికల్లో 92.93 శాతం పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం.
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!