Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News West Bengal Election Results 2026 Mamata Banerjee Bjp Battle Analysis

West Bengal: బెంగాల్ కురుక్షేత్రంలో గెలుపెవరిది? 2016లో 3 స్థానాలు, 2021 నాటికి 77 సీట్లు.. బీజేపీ మాస్టార్ ప్లాన్ పనిచేస్తుందా?

Published Date :May 4, 2026 , 7:34 am
By RAMAKRISHNA KENCHE
West Bengal: బెంగాల్ కురుక్షేత్రంలో గెలుపెవరిది? 2016లో 3 స్థానాలు, 2021 నాటికి 77 సీట్లు.. బీజేపీ మాస్టార్ ప్లాన్ పనిచేస్తుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. 2011 నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించి, 35 ఏళ్ల సుదీర్ఘ వామపక్ష పాలనను అంతమొందించిన మమతా బెనర్జీ, ఈసారి తన పట్టు నిలుపుకుంటారా? లేక బెంగాల్‌ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా? అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్లు తొలగించడం, చొరబాట్లు, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాల చుట్టూ తిరిగిన ఈ ఎన్నికల పోరులో అంతిమ విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

2016లో కేవలం 3 స్థానాలు, 10 శాతం ఓట్ల వాటాతో మొదలైన బీజేపీ ప్రస్థానం, 2021 నాటికి 77 స్థానాలు, 38 శాతం ఓట్ల వాటాతో ఊహించని రీతిలో పుంజుకుంది. అయితే, అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా తన బలాన్ని పెంచుకుంటూ 215 స్థానాలతో 48 శాతం ఓట్ల వాటాను దక్కించుకుంది. ఈసారి బీజేపీ వ్యూహకర్త అమిత్ షా మొదటి దశలోనే 110 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేయగా, 152 స్థానాలు ఉన్న దక్షిణ బెంగాల్ మాత్రం ఇప్పటికీ తృణమూల్ కంచుకోటగానే కనిపిస్తోంది. కానీ ఉత్తర బెంగాల్‌పై బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ మార్కు 148 కాగా, రీపోలింగ్ కారణంగా ఫాల్టా మినహా మిగిలిన 293 స్థానాల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

Also Read

  • Suvendu Adhikari: సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం వస్తోంది.. దేవుడు మాతోనే ఉన్నారు..
  • Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ
  • Assam Assembly Election Results: హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా.. ఈసారి జలుక్‌బరి స్థానంలో ఎవరు గెలుస్తారు?
  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన గెలుపుపై అమితమైన నమ్మకంతో ఉన్నారు. 92 శాతానికి పైగా పోలింగ్ నమోదవ్వడం తమకు అనుకూలమని భావిస్తున్న ఆమె, ఈసారి 226 నుంచి 230 స్థానాలు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంపై స్పందిస్తూ, అది ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని ఆమె కొట్టిపారేశారు. అయితే, సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లను (సుమారు 11.6 శాతం ఓటర్లు) జాబితా నుంచి తొలగించడం తృణమూల్ గెలుపు అవకాశాలను దెబ్బతీసే అంశంగా మారింది. ఇందులో 27 లక్షల మందికి పైగా ఓటర్ల అప్పీళ్లు ఇంకా పెండింగ్‌లో ఉండటం గమనార్హం.

ఈ ఎన్నికలను మమతా బెనర్జీ ఒక ‘జీవన్మరణ పోరాటం’గా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో చక్రాల కుర్చీలో కూర్చుని పెయింటింగ్ వేస్తున్న మమత చిత్రం ప్రజల్లోకి బలంగా వెళ్లగా, ఈసారి బీజేపీ తన వ్యూహాలను మార్చింది. కేవలం అవినీతి, శాంతిభద్రతల సమస్యలను మాత్రమే కాకుండా, తృణమూల్ పాలనను “లెఫ్ట్ ఫ్రంట్ 2.0” గా అభివర్ణించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, స్థానికతను చాటుతూ ‘మట్టి బిడ్డలకు’ అవకాశం ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో కూడా కేవలం “జై శ్రీరామ్” మాత్రమే కాకుండా, బెంగాలీ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ “జై మా కాళి”, “జై మా దుర్గ” నినాదాలను ఎత్తుకుంది. చివరకు తమ బెంగాలీ మూలాలను నిరూపించుకోవడానికి బీజేపీ అభ్యర్థులు చేపలతో ప్రచారం చేయడం కూడా ఆసక్తిని రేకెత్తించింది.

దీనికి ప్రతిగా మమతా బెనర్జీ “బయటి వ్యక్తుల నుంచి బెంగాల్ సంస్కృతిని కాపాడుకోవడం” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ తర్వాత, ఆమె తన పాత నినాదాన్ని “మార్పు వద్దు – ప్రతీకారం కావాలి” (Badal noy Badla chai) అని మార్చి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఓట్లు తొలగించబడిన కుటుంబాల ఆగ్రహాన్ని తన ఓట్లుగా మలుచుకోవాలని ఆమె చూస్తున్నారు. ముఖ్యంగా భవానీపూర్ స్థానంలో తన మాజీ అనుచరుడు సువేందు అధికారితో తలపడుతున్న మమతకు, 2021 నందిగ్రామ్ ఫలితం పునరావృతం కాకూడదన్నది ప్రధాన లక్ష్యం. 71 ఏళ్ల వయస్సులో ఉన్న దీదీకి, ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే తిరిగి పుంజుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. బెంగాల్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందా లేక పాత పాలకులకే పట్టం కడుతారా అనేది మరికొద్ది సేపట్లో తేలిపోతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah strategy
  • Bengal politics analysis
  • Bhabanipur results
  • BJP Bengal
  • Exit Polls Bengal

తాజావార్తలు

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • West Bengal: బెంగాల్ కురుక్షేత్రంలో గెలుపెవరిది? 2016లో 3 స్థానాలు, 2021 నాటికి 77 సీట్లు.. బీజేపీ మాస్టార్ ప్లాన్ పనిచేస్తుందా?

  • Donald Trump: ట్రంప్ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ప్రకటన.. హార్మూజ్‌లో చిక్కుకున్న ఓడలను సురక్షితంగా బయటకు..

  • Suvendu Adhikari: సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం వస్తోంది.. దేవుడు మాతోనే ఉన్నారు..

  • Anirudh : హీరోల స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

  • Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions