Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News West Bengal Bjp Government Suvendu Adhikari Amit Shah Nirbhay Bengal

Amit Shah: గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ..

Published Date :May 8, 2026 , 6:30 pm
By Venu Goapl Reddy
Amit Shah: గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Amit Shah: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సర్కార్ ఏర్పడబోతోంది. బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో శుక్రవారం కోల్‌కతాలో జరిగిన శానసభ పక్ష సమావేశంలో సీఎం ఎన్నిక జరిగింది. బీజేపీపై విశ్వాసం ఉంచడం ద్వారా ప్రజలు ‘‘నిర్బయ బెంగాల్’’ దిశగా ఒక అడుగు వేశారని షా అన్నారు. బీజేపీ, ప్రధాని మోడీపై విశ్వాసాన్ని ఉంచి బెంగాల్ ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు.

కమ్యూనిస్ట్ పాలన నుంచి బెంగాల్‌లో భయం, హింసాత్మక వాతావరణం ఉందని, ఇది ఆ తర్వాత తీవ్రంగా మారిందని అమిత్ షా ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని అన్నారు. ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ‘‘సోనార్ బంగ్లా’’(బంగారు బెంగాల్) లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పారు. బెంగాల్ భయం రహిత సమాజం దిశగా వెళ్తుందని అన్నారు.

Also Read

  • Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
  • Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?
  • Vijay-Governor: గవర్నర్‌కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..!
  • Vijay Cabinet: విజయ్ కేబినెట్ లిస్ట్ రెడీ.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..!
Add as a preferred
source on google

గత 5 దశాబ్ధాలుగా బెంగాల్ శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ పరంగా తీవ్రమైన ప్రతికూల రాజకీయాలను చూసిందని.. బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఇప్పుడు బీజేపీ బాధ్యత అని అన్నారు. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేస్తూ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారు కోరుకున్న బెంగాల్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు.

Read Also: Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?

ఈ విజయం చాలా ముఖ్యమైందని, 1950లో ప్రారంభమైన సైద్ధాంతిక ప్రయాణం నేడు బెంగాల్‌కు చేరుకుందని, శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మస్థలంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుండటం ఒక చారిత్రక ఘట్టమని చెప్పారు. 2014లో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఇప్పుడు గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు చేరిందని ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని చెప్పారు. ఈ విజయం కోసం 321 మంది బీజేపీ కార్యకర్తలు తమ ప్రాణాలను కోల్పోయారని, ఈ విజయం సులభంగా రాలేదని అమిత్ షా వెల్లడివంచారు.

త్రిపుర, అస్సాం, బెంగాల్‌లలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడటంతో సరిహద్దు భద్రతను మరింత పెరుగుతుందని, అక్రమ రవాణా, చొరబాట్లను కఠినంగా అణిచివేస్తామని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా చొరబాటుదారుల్ని గుర్తించి వారిని తరిమివేసి, చొరబాటురహిత దేవంగా మారుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మమతా బెనర్జీని ఆమె సొంత ఇంటిలో భవానీపూర్‌లో ఓడించి శక్తివంతమైన సందేశాన్ని పంపినట్లు అమిత్ షా చెప్పారు. ఈ విజయంతో బీజేపీపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హింస, కక్షపూరిత రాజకీయాలకు తావు ఉండకూడదని కార్యకర్తల్ని కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • bengal politics
  • bjp government
  • bjp victory
  • Kolkata News

తాజావార్తలు

  • Amit Shah: గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ..

  • Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..

  • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..

  • China: జిన్‌పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక ‘అసలు’ మిస్టరీ ఇదేనా!

  • Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions