Vijay Cabinet: విజయ్ కేబినెట్ లిస్ట్ రెడీ.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..!
- తమిళనాడులో తొలగిన రాజకీయ అనిశ్చితి
- విజయ్‌కు చిన్న పార్టీలు మద్దతు
- ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు లైన్ క్లియర్
- కేబినెట్ లిస్ట్ రెడీ చేసిన విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. తమిళనాడులో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ వర్సెస్ విజయ్ మధ్య చర్చలు తీవ్ర టెన్షన్ నెలకొల్పాయి. పూర్తి మెజార్టీతో వస్తేనే అవకాశం ఇస్తానని గవర్నర్ చెప్పడంతో తమిళనాడు పాలిటిక్స్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి చిన్న పార్టీలు విజయ్‌కు సపోర్ట్‌గా నిలబడడంతో ఉత్కంఠకు తెరపడింది.
విజయ్‌కు వామపక్షాలు, వీసీకే పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన మద్దతుతో బలం 112కు చేరింది. ఇప్పుడు సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118కు చేరింది. మరికాసేపట్లో గవర్నర్ అర్లేకర్‌ను కలిసి విజయ్ లిస్ట్ అందజేయనున్నారు.
Also Read
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
కేబినెట్ బెర్త్‌లు ఖరారు!
ఇక విజయ్ కేబినెట్‌లో వీసీకేకు ఒక మంత్రి పదవి.. వామపక్షాలకు రెండు బెర్త్‌లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్‌కు కూడా కీలక పదవులు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. దాదాపుగా మంత్రివర్గ కూర్పుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇక విజయ్ సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీకే ప్రభుత్వంలో వీసీకేకు ఒక మంత్రి పదవి కేటాయించనున్నారు. అలాగే వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంకు చెరో మంత్రి పదవి ఇచ్చే అవకాశముంది. ఈ మేరకు మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ మూడు పార్టీలకు అసెంబ్లీలో చెరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకే కూటమిలో ఉన్న ఈ పార్టీలు.. రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. స్టాలిన్ కూడా తమ రాజకీయ ప్రయోజనాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని మిత్రపక్షాలకు స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం జరిగిన ఉన్నతస్థాయి చర్చల తర్వాతే ఈ పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.
వీసీకే అధినేత తిరుమావలవన్ స్వయంగా కేబినెట్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా టీవీకే ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!