Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధిని కొత్త దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రధాన చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన NTVతో మాట్లాడుతూ.. రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్ర పర్యాటకం పూర్తిగా మారేలా అనేక కీలక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని తెలిపారు. అలాగే, సీప్లేన్ కు వయబిలిటీ సమస్య ఉన్నప్పటికీ, వయబిలిటీని గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఇప్పటికే చర్చలు జరిపి, కేంద్ర సహకారంతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
Read Also: Indigo: క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటున్న ఇండిగో, ఎయిర్ పోర్ట్లో ప్రయాణికులు ఫైర్ !
ఇక, గోదావరి నుంచి సీప్లేన్ లు తయారు చేసి నడిపిస్తామని మంత్రి దుర్గేష్ తెలియజేశారు. 2026 జూన్ జులై నుంచి సీప్లేన్ ను తీసుకొస్తాం.. క్రూజ్ తీసుకురావడానికి క్రెడిలాతో మాట్లాడాం.. గోదావరి, కృష్ణాల నుంచి క్రూజ్ లు ఇవ్వాలని అడిగాం.. ఎంఓయూలపై ప్రతి 15 రోజులకు సీఎం ఒక రివ్యూ చేస్తారు.. 2019-24 మధ్య ఉన్న ప్రభుత్వం లాగా సుష్క వాగ్దానాలు చేయకుండా కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అలాగే, మ్యూజిక్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం.. తిరుపతి, విశాఖ, అమరావతి హబ్ లుగా పర్యటక అభివృద్ధికి 25 వేల కోట్ల ప్రాజెక్టులు తెచ్చాం.. భవానీ ద్వీపంలో థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి, వైజాగ్ లోని విశ్వనాథన్ తో ఎంఓయూ కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. అయితే, టెంపుల్ టూరిజం నుంచే మనకు ఎక్కువ మంది వస్తున్నారు అని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ట్రెక్కింగ్, అడ్వెంచర్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలలో హయత్, అట్మాస్ఫియర్ కోర్, తాజ్, ఓబెరాయ్ వంటి హోటల్స్ వస్తున్నాయి.. అలాగే, వెల్నెస్ టూరిజం కోసం బాబా రాందేవ్ తో కూడా ఎంఓయూ చేసుకున్నట్లు వెల్లడించారు.