Harish Rao: దీపావళి పండగ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు దీపావళి పర్వదినాన చార్మినార్ లోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది.. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.. అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం జరిగింది.. హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మతసామరస్యానికి ప్రతీకగా ఉండేది.. చార్మినార్ లో భాగంగా అమ్మవారి దేవాలయం ఉండడం హిందువులు ముస్లింలను గౌరవించడం, ముస్లింలు హిందువులను గౌరవించడం లాంటి సాంప్రదాయాలు ఉన్న గొప్ప సంస్కృతి మనది అన్నారు. హైదరాబాద్ నగరం ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది.. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేని పరిస్థితి నెలకుందని హరీష్ రావు అన్నారు.
ఇక, ఒక రౌడీషీటర్ పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం చాలా దురదృష్టకర సంఘటన అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రే హోంమంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైంది.. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం ఏర్పడింది.. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొని అభివృద్ధిలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది అని మాజీ మంత్రి పేర్కొన్నారు.
Read Also: Daksha: OTT టాప్ ట్రెండ్ లో దూసుకుపోతున్న మంచు లక్ష్మి ‘దక్ష’..
అలాగే, కేబినెట్ లో ఏం జరిగిందో నేను చెప్పాల్సిన పని లేదు.. స్వయానా మంత్రి కుమార్తెనే చెప్పిందని హరీష్ రావు తెలిపారు. గన్ ఎవరు తెచ్చారు అనే దానిపై సమాధానం చెప్పమనండి.. తుఫాకులు పెట్టి అక్రమార్జన చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం స్పందించలేదు.. ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. కేబినెట్ మంత్రులు, వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఇవి.. మీరు నిజంగా తప్పు చేయలేదంటే విషయాలు బయటకు తేవాలన్నారు. తప్పులు చేయకపోతే పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వెళ్లారు?.. హైదరాబాదును గుండా రాజ్యాంగా మార్చారు.. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు స్వర్గధాయంగా మారిస్తే, మీరు తుపాకులు పెట్టి పెట్టుబడిదారులను భయపెడుతున్నారని ఆరోపించారు. ఈరోజు పాలన చేస్తున్నారా? వాటాలు పంచుకోవడానికి మీలో మీరు తన్నుకు చస్తున్నారా?.. మేము అగ్రికల్చర్ ని పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం గన్ కల్చర్ ని పెంచిందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు.
