జైపూర్‌లో డ్యామ్ తెగిపోవడంతో శ్మశానవాటిక మునిగిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చాయి. అవి నీటిలో కొట్టుకుపోయాయి. చాలా మృతదేహాలు సమాధి నుంచి బయటకు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఇది చూసి అందరూ అవాక్కయ్యారు. కానీ ప్రజలు వాటిని కాలువలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానికులు తాడు సహాయంతో మృతదేహాలను బయటకు తీసి సమాధిలో మళ్లీ పాతిపెట్టారు.
READ MORE: CM Revanth Reddy: మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు.. ఎకరాకు రూ.10 వేలు పరిహారం
వాస్తవానికి ఖోహ్ నగోరియన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో భారీ వర్షానికి నూర్ డ్యాం ఆనకట్ట తెగింది. నీరు దర్గా వెనుక ఉన్న శ్మశాన వాటికలోకి చేరాయి.
ఈ సమయంలో వర్షం నీటికి శ్మశానవాటిక పూర్తిగా శిథిలమై 5 మృతదేహాలు సమాధి నుంచి బయటకు వచ్చాయి. కొంత సమయం తరువాత, మృతదేహాలు నీటి ప్రవాహంలో ఒక్కొక్కటిగా తేలడం ప్రారంభించాయి. చాలా కష్టపడి, ప్రజలు వాటిని తిరిగి సమాధిలో పాతిపెట్టారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ కగ్గీ స్పందించారు. దీనిపై జైపూర్ కలెక్టర్‌కు సమాచారం అందించగా, తగిన ఏర్పాట్లు చేసేందుకు ఎస్ డీఆర్ఎఫ్ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. భవిష్యత్తులో వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు కోరారు.
READ MORE:Kannauj rape case: మైనర్ బాలికని రేప్ చేసింది సమాజ్‌వాదీ పార్టీ నాయకుడే.. డీఎన్ఏ మ్యాచ్..
కాగా.. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వానలతో జనజీవనం స్తంభించింది. విజయవాడ నగరం పూర్తిగా నీట మునిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తీరం దాటిన వాయుగుండం జగదల్ పూర్‌కు ఆగ్నేయంగా 60 కిలోమీటర్లు, విశాఖకు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించారు. ఇది క్రమంగా దక్షిణ ఒడిశా – విదర్భ చేరుకుని బలహీనపడుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ క్రమంలో పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.