NTV Telugu Site icon

PM Modi: పాట్నా గురుద్వారాలో సిక్కు వేషధారణతో సేవ చేసిన మోడీ

Modi

Modi

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ పాట్నాలో పర్యటిస్తున్నారు. ఆదివారం బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో కలిసి మోడీ రోడ్ షో నిర్వహించారు. సోమవారం పాట్నా గురుద్వారాలో తలపాగా ధరించి ప్రధాని లంగర్ సేవ చేశారు. పాట్నా సాహిబ్ గురుద్వారా.. సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జన్మస్థలంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీని నిర్మాణం 18వ శతాబ్దంలో గురుగోవింద్ సింగ్ జన్మస్థలానికి గుర్తుగా మహారాజా రంజిత్ సింగ్‌చే నిర్మించబడింది.

ఇది కూడా చదవండి: Madhavilatha : మాధవిలతపై ఈసీకి ఎంఐఎం ఫిర్యాదు.. కౌంటర్‌ ఇచ్చిన మాధవి లత

బీహార్ రాజధాని పాట్నాలోని సాహిబ్ గురుద్వారాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం తలపాగా ధరించి, ఖీర్ కుండ పట్టుకుని భక్తులకు లంగర్, సామూహిక భోజనం వడ్డించారు. ఆహారం వండడానికి గురుద్వారా నిర్వహణకు కూడా ప్రధాని మోడీ సహాయం చేశారు. స్వయంగా చపాతీలు తయారు చేయడం, భక్తులకు దగ్గరుండి వండించారు.

ఇది కూడా చదవండి: Groom voted: మరికాసేపట్లో పెళ్లి.. పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్ళికొడుకు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం రాత్రి పాట్నాలో రోడ్‌షో నిర్వహించారు. పూలు, బీజేపీ చిహ్నాలతో అలంకరించిన వాహనంపై ప్రధాని మోడీ దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవిశంకర్ ప్రసాద్‌లతో పాటు వీధుల్లోకి వచ్చిన జనసమూహానికి ప్రధాని మోడీ అభివాదం చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ కీలకమైన రాష్ట్రం. ఒక్కడ 40 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. బీహార్ రాష్ట్రం.. లోక్‌సభ స్థానాలకు అతి పెద్దదిగా ఉంది. ఇక్కడ బీజేపీ, జేడీయూ ఉమ్మడిగా బరిలోకి దిగాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. సోమవారం నాల్గో విడత పోలింగ్ జరుగుతోంది. అనంతరం మే 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: “దాణా కుంభకోణంలో దోషి ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తున్నాడు”.. లాలూపై మోడీ ఫైర్..

Show comments