శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎల్‌జేపీ (రామ్‌విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌ను మోడీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో మోడీకి మద్దతుగా ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రశంసించారు. మోడీ దగ్గరకు వెళ్లి కరచాలనం చేసి కౌగిలించుకున్నారు. అనంతరం మోడీ కూడా.. చిరాగ్‌ను భుజంపైకి తీసుకుని తలపై ముద్దు పెట్టారు. ఈ సీన్‌తో అందరూ చప్పట్లతో అభినందించారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: కంగనాని చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కి మద్దతుగా రైతుల సంఘాల నిరసన..
చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి కృషి చేసిన మోడీకి అభినందనలు తెలిపారు. ఈ ఘనత మోడీకే దక్కుతుందని చెప్పారు. సంకల్పబలమే చరిత్రలో ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయడంలో దోహదపడిందని కొనియాడారు. మూడోసారి ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ప్రధానిపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. మోడీ వల్లే ప్రపంచం ముందు భారత్ దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని చెప్పారు.
ఇది కూడా చదవండి: ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు.. చాలా అన్యాయం అన్న అంటూ యాంకర్ శ్యామల వీడియో
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో జనతాదళ్-యునైటెడ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జనతాదళ్ సెక్యులర్, శివసేన, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ దళ్ మరియు ఇతర పార్టీలు ఉన్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ 272కు బీజేపీ దూరమైంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల మద్దతు అవసరం. కూటమి సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం 293కు చేరింది. ఇక ఇండియా కూటమి 232 సీట్లు సాధించింది. ఇక ముచ్చటగా మూడోసారి మోడీ.. జూన్ 9న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి దేశం నుంచే కాకుండా ఆయా దేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Narendra Modi: ఇండి కూటమిపై విరుచుకపడ్డ మోడీ..