యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో బెడ్ పై పడుకున్నట్లు.. రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అది కూడా.. కింద టవల్, పైన గొడుగు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ట్రాక్‌పై నిద్రిస్తున్న లోకో పైలట్ సకాలంలో చూసి బ్రేకులు వేసి అతని ప్రాణాలు కాపాడాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.