Site icon NTV Telugu

CM Chandrababu: సూపర్ సిక్స్.. సూపర్ హిట్.. అమరావతిని గాడిన పెడుతున్నాం..

Babu

Babu

CM Chandrababu: సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.. అంటు వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రతేనన్న ఆయన.. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది.. కానీ, చెత్తను మాత్రం తీయలేదన్నారు.. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.. అక్టోబరు 2వ తేదీ నాటికి అన్ని మున్సిపాలిటీల్లో చెత్తాచెదారం తొలగిస్తామని ప్రకటించారు చంద్రబాబు.. ఇక, మంచి మనస్సు ఉన్న వాళ్లు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటారు.. అటువంటి జిల్లాలో గత ప్రభుత్వంలో రౌడీయిజం జరిగిందన్నారు.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి కుక్కలు చింపిన విస్తరి చేశారు.. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో నేను , పవన్ కల్యాణ్‌ చెప్పాం.. ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు.

Read Also: Ganesh Chaturthi 2025: వినాయక నిమజ్జనం రోజు డీజేలకు అనుమతి ఉందా..?

ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేట్ వ్యక్తులు మేనేజ్ చేసేలా హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తాం అన్నారు చంద్రబాబు.. 47 లక్షలు మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందించాం.. ఉచిత బస్సు ప్రయాణంతో ఆడ బిడ్డలు ఆనందంగా ఉన్నారు.. డ్వాక్రా సంఘాలు నేనే పెట్టాను.. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నారు.. అయితే, బోర్ కొట్టిందని ఉచిత బస్సులు ఎక్కితే లేని పోనీ సమస్యలు వస్తాయి.. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.. అమరావతిని గాడిన పెడుతున్నాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అన్నారు.. ఆర్టీసీ బస్సులలో కోటి మంది పైగా మహిళలు ప్రయాణం చేశారని తెలిపారు.. దుర్మార్గులు కి ఓటు వేస్తారు.. 40 ఏళ్ల నుంచి రాజకీయాలు లో చేస్తున్నాను.. ఇలాంటి వారిని ఎప్పుడు చూడలేదన్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ కాకుండా 12 వేలు కోట్లు ఇప్పించాం అన్నారు ఏపీ సీఎం..

Read Also: Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..

అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం లేదు.. ఆ హోదా రావాలంటే 18 సీట్లు ఉండాలన్నారు చంద్రబాబు.. సోషల్ మీడియా లో ఆడవారి పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఒక పార్టీ విష రాజకీయ పార్టీ గా మారిందన్నారు.. అరుంధతి సినిమాలో డైలాగ్ చెప్పిన సీఎం.. నిన్ను వదల బొమ్మాళి నిన్ను వదలా అంటూ ఒక భూతం రాష్ట్రాన్ని వెంటాడుతుందన్నారు.. అయితే, అమరావతి, విశాఖ, తిరుపతిలను బ్రహ్మండంగా అభివృద్ధి చేసే బాద్యత నాది అని స్పష్టం చేశారు.. అర్హులుకి ఖచ్చితంగా పింఛన్లు ఇస్తారని తెలిపారు.. ఇక, అమరావతి మునగలేదు.. మీ పార్టీ మునిగిపోయింది అంటూ వైసీపీపై మండిపడ్డారు. సంపద సృష్టించడం.. ఆదాయాన్ని పెంచడం మాకు తెలుసు. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దీర్ఘకాలం కొనసాగదు. నేను సూపర్‌ సిక్స్‌ అంటే సాధ్యం కాదన్నారు.. చేసి చూపించాం. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version