IND vs WI: ఐపీఎల్లో ఆడలేదని అభిమన్య ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ లకు వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కలేదని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆరోపించారు. దేశవాళీ క్రికెట్‌లో వారు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని వసీం తెలిపాడు. అయితే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత వన్డే, టెస్టు జట్టును నిన్న ప్రకటించారు. ఇప్పుడు జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ టీమ్ ఎంపికపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. అంతేకాకుండా కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు.
Read Also: Monsoon Update: హిమాచల్, జార్ఖండ్, యూపీలోకి రుతుపవనాలు ప్రవేశం.. భారీ వర్షసూచన
అభిమన్యు ఈశ్వరన్ మరియు ప్రియాంక్ పంచల్ రంజీ మరియు ఇండియా ‘ఎ’ కోసం అద్భుతంగా రాణించారని వసీం జాఫర్ అన్నాడు. చాలా కాలంగా టెస్ట్ ల్లో కొత్త క్రికెటర్లకు అవకాశమివ్వాలని ఆయన చెబుతూనే ఉన్నాడు. మరోవైపు టెస్ట్ టీంలో రుతురాజ్ గైక్వాడ్ ను ఎంపిక చేయడం పట్ల తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వెస్టిండీస్ పర్యటనలో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు టెస్టు జట్టులోకి ఎంపిక కాగా.. సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ సహా కొంతమంది ఆటగాళ్ల కోసం నిరీక్షణ కొనసాగుతోందని వసీం జాఫర్ తెలిపాడు. అయితే వెస్టిండీస్ తో టెస్టు జట్టు ఎంపిక చూసి చాలా నిరాశకు గురయైనట్లు తెలిపాడు. అంతేకాకుండా నలుగురు ఓపెనర్ల అవసరం ఏంటని ప్రశ్నించాడు. సర్ఫరాజ్ ఖాన్‌ను అదనపు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపిక చేసి ఉండవచ్చుగా అని జాఫర్ అన్నాడు. సర్ఫరాజ్ దేశీయంగా నిలకడగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు.
Read Also: Bhola Shankar Teaser Launch Event Live: భోళా శంకర్ టీజర్ రిలీజ్ లైవ్
మరోవైపు మహ్మద్ షమీకి వెస్టిండీస్ టూర్ లో విశ్రాంతి ఇవ్వడంపై జాఫర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నెల రోజుల విరామం ఉన్నప్పటికీ షమీకి విశ్రాంతి ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు. షమీ మంచి బౌలర్ అని, అతను ఎంత ఎక్కువ బౌలింగ్ చేస్తే అంత ఫిట్ గా ఫామ్ లోకి వస్తాడన్నాడు. అయితే వసీం జాఫర్ తో పాటు మరికొంత మంది మాజీ ఆటగాళ్లు కూడా టీమిండియా సెలక్షన్ పై మండిపడుతున్నారు. దీంతో సెలక్టర్లు మరోసారి అయోమయంలో పడ్డారు.
టెస్ట్ స్క్వాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్