NTV Telugu Site icon

Wasim Akram: సొంత టీమ్పై మండిపాటు.. రోజూ 8 కేజీల మటన్ తింటే ఇలానే ఉంటుంది

Wasim Akram

Wasim Akram

ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చూపిస్తోంది. నిన్న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాక్‌ జట్టు ఓడిపోయింది. ఇంతకు ముందు భారత్, ఆస్ట్రేలియా వంటి జట్ల చేతిలో కూడా పాక్ జట్టు ఓడిపోయింది. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ మాజీ క్రికెట్ దిగ్గజం, మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు.

Read Also: Reliance Industries: రిలయన్స్‌ చేతికి డిస్నీ హాట్ స్టార్‌..?

పాకిస్థాన్ ఛానెల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఓటమిపై చర్చిస్తూ.. బాబర్ అజామ్ కెప్టెన్సీలో ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన జట్టులోని ఆటగాళ్లందరిపై వసీం అక్రమ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రశ్నలను లేవనెత్తాడు. గత 2 సంవత్సరాలలో పాకిస్తాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరీక్ష జరగలేదని.. తాము 3 వారాలుగా షోలో అరుస్తున్నామని చెప్పాడు. ఇక్కడ క్రీడాకారుల పేర్లు ప్రస్తావిస్తే వారికి నచ్చదు కానీ వీళ్లు రోజుకు 8 కేజీల చొప్పున మంటన్ తింటున్నట్టు ఉంది. వాళ్లు దేశం తరపున బరిలోకి దిగారు. ఇందుకోసం పారితోషికం కూడా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు కాస్తంత ప్రొఫెషనల్‌గా ఉండాలని వసీం అక్రమ్ అన్నాడు.

Read Also: World Cup 2023: నేడు దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ జట్టు పేలవమైన ఫీల్డింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ మిగతా విభాగాల్లో రాణిస్తారు. కానీ ఈ ప్రపంచకప్ లో ఎందులోనూ రాణించలేకపోతున్నారు. ఈ కారణంగా వన్డే ఫార్మాట్ లో పాకిస్తాన్ జట్టు మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.