ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చూపిస్తోంది. నిన్న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాక్ జట్టు ఓడిపోయింది. ఇంతకు ముందు భారత్, ఆస్ట్రేలియా వంటి జట్ల చేతిలో కూడా పాక్ జట్టు ఓడిపోయింది. పాకిస్థాన్ ఛానెల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఓటమిపై చర్చిస్తూ.. బాబర్ అజామ్ కెప్టెన్సీలో ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన జట్టులోని ఆటగాళ్లందరిపై వసీం అక్రమ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రశ్నలను లేవనెత్తాడు. గత 2 సంవత్సరాలలో పాకిస్తాన్ ఆటగాళ్ల…
పాకిస్థాన్ కెప్టెన్సీ గురించి షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. “బాబర్ ఆజం రాజీనామా చేస్తే వైట్ బాల్ క్రికెట్‌లో షాహీన్ అఫ్రిదీని కెప్టెన్‌గా చేయాలన్నాడు. అతను లాహోర్ ఖలందర్స్‌కు అటాకింగ్ కెప్టెన్ అని చూపించాడని తెలిపాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్ లో షాహీన్ అఫ్రిది తన కెప్టెన్సీలో లాహోర్ ఖలందర్స్‌ను ఛాంపియన్‌గా చేశాడు.