NTV Telugu Site icon

IND vs PAK: విరాట్ కోహ్లీని బాబర్‌ ఆజామ్ జెర్సీ అడగకుండా ఉండాల్సింది.. పాక్‌ లెజెండ్‌ సంచలన వ్యాఖ్యలు!

Babar Azam Head

Babar Azam Head

Wasim Akram Fires on Babar Azam for shirt swap with Virat Kohli: శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని కలిసి మాట్లాడాడు. ఆపై బాబర్ కోరిక మేరకు కోహ్లీ తాను సంతకం పెట్టిన జెర్సీని పాక్ కెప్టెన్‌కు గిప్ట్‌గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై పాక్‌ లెజెండ్‌ వసీం అక్రమ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బాబర్ ఆజమ్ కెమరాల ముందు విరాట్‌ కోహ్లీ నుంచి జెర్సీని తీసుకోవడాన్ని పాక్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ తప్పుబట్టాడు. ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌లో అక్రమ్‌ మాట్లాడుతూ… ‘పాకిస్తాన్ కెప్టెన్ బాబర్‌ ఆజమ్ చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. ఈరోజు ఇలా చేయాల్సింది కాదు. ఒకవేళ తనకు విరాట్ జెర్సీకావాలనుకుంటే కెమెరాల ముందు కాకుండా.. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి అడగాల్సింది. బాబర్‌ మామ కొడుకు విరాట్ జెర్సీ కావాలని అడిగాడు. ఏదేమైనా బాబర్‌ పబ్లిక్‌గా జెర్సీ అడగడం బాగాలేదు’ అని అన్నాడు.

Also Read: Rizwan-Kohli: మహ్మద్‌ రిజ్వాన్ అతి తెలివితేటలు.. ఫ్ట్రస్ట్రేట్ అయిన విరాట్ కోహ్లీ!

పాకిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌పై భారత్‌ విజయపరంపర కొనసాగుతోంది. వన్డే ప్రపంచకప్‌లలో ఇండో-పాక్ రికార్డు 8-0గా ఉంది. దాయాది దేశాలు సెమీస్‌లో తలపడే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబరు 19న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మరోవైపు అక్టోబర్ 20న బెంగళూరులోని ఎంఏ చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది.

Show comments