Warangal: వరంగల్‌లో మొంథా తుఫాన్ బీభత్సానికి 6465 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. హనుమకొండ ప్రాంతం కాజీపేట సర్కిల్ కార్యాలయం పరిధిలో 4150.. వరంగల్ ప్రాంతంలోని కాశీబుగ్గ సర్కిల్ పరిధిలో 2315 నివాస గృహాలు దెబ్బతిన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.. అధికారులు ఈ సర్వే నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. వరంగల్ ప్రాంతం కంటే హనుమకొండ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. హనుమకొండ వరంగల్ ప్రాంతాలలో ఇళ్లతో పాటు రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నట్లు ఇంజనీర్ల పరిశీలనలో తేలింది.. ఇందుకోసం బీటీ, సీసీ, డబ్ల్యూబీఎం. రోడ్లవారీగా నివేదికను సిద్ధం చేశారు.. డ్రైనేజీలు, కల్వర్టులు, త్రాగునీటి పైపులైన్లు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల నష్టంపై అంచనాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.. రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ జారీ చేసిన నిబంధనల ప్రకారం నివేదిక రూపొందించాలని ఇంజనీర్లకు గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్ ఆదేశాలు జారీ చేశారు.
READ MORE: Warangal: వరంగల్‌లో మొంథా తుఫాన్ బీభత్సం.. ఏకంగా 6465 ఇళ్లు..