Warangal: జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది.. కరీమాబాదులోని ఉర్సు దర్గా ఆటో స్టాండ్ వద్ద ఉన్న పూలే విగ్రహాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు.. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు విచారణలో చేపట్టారు… అనంతరం సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.. మద్యం మత్తులో ఓ వ్యక్తి పూలే విగ్రహంపై బండరాయి విసిరి ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఇది ఇలా ఉంటే గత రెండేళ్ల క్రితం ఇదే విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు… తరచూ పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై సామాజిక మాధ్యమాలలో చర్చనీఅంశంగా మారింది..
READ MORE: K RAMP : కిరణ్ అబ్బవరం ర్యాంప్.. జస్ట్ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్