Ponguleti Srinivas Reddy : వరంగల్‌ను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే రాబోయే తరాలకు ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్మకొండలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, వరంగల్ అభివృద్ధి కోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించామని వివరించారు. వరంగల్ చుట్టూ 3 విడతల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ జిల్లాకు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5,213 కోట్లు విడుదల చేసిందని ఆయన తెలిపారు. మామునూరు ఎయిర్ పోర్టు, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ ప్రాజెక్టును అత్యంత త్వరలో పూర్తి చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఇందుకోసం భూసేకరణ నిమిత్తం రూ. 205 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
Strong Bones Calcium: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. క్యాల్షియం కొరత ఉండదు
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. హైదరాబాద్ స్థాయిలో వరంగల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. తాను 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ముఖ్యమంత్రులను చూశానని, ఆలోటలో అభిమానించదగ్గ నాయకులు దివంగత వైఎస్ఆర్ (YSR) , ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాత్రమేనని ప్రశంసించారు. తన గతం గురించి ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో కేసీఆర్ (KCR) నాయకత్వంలో పని చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అయితే, కేసీఆర్ వరంగల్‌కు ఇచ్చిన ఎన్నో హామీల్లో ఒక్కటీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వరంగల్‌ను అభివృద్ధి చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న దీక్షను మెచ్చుకున్నారు.
వరంగల్ కోసం దాదాపు రూ.5 వేల కోట్ల నిధులను కేటాయించడం ఆయన అభివృద్ధి పట్ల ఉన్న దృఢ నిశ్చయానికి నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా, వరంగల్ ప్రజల కలలైన విమానాశ్రయం ప్రాజెక్టు కూడా త్వరలోనే సాకారమవుతుందని చెప్పారు. వరంగల్‌ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తాము ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటామని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు.
Health: ఈ కూరగాయలు తింటే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.. మీరు తింటున్నారా..?