NTV Telugu Site icon

Maharashtra: బీజేపీ, షిండే వర్గం మధ్య వార్.. గత ఎన్నికల్లో బీజేపీ జోక్యంపై శివసేన సీనియర్ నేత ఫైర్

New Project (10)

New Project (10)

లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీయే నేతృత్వంలోని మహాయుతి కూటమిలో సీట్ల పంపకంపై టగ్ ఆఫ్ వార్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల విషయంలో మిత్రపక్షాలైన బీజేపీ, అజిత్ పవార్‌ను శివసేన (షిండే వర్గం) సీనియర్ నాయకుడు రాందాస్ కదమ్ లక్ష్యంగా చేసుకున్నారు. శివసేన 58వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో రాందాస్ కదమ్ మాట్లాడుతూ.. బీజేపీ ఎన్నికలకు 2 నెలల ముందు శివసేన (షిండే వర్గం) లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తే మొత్తం 15 స్థానాల్లో విజయం సాధించి ఉండేవాళ్లమని అన్నారు. తాము అభ్యర్థులను ప్రకటించినప్పుడు, బీజేపీ మళ్లీ రంగంలోకి దిగి ఆ స్థానాలపై తన హక్కును చాటుకుందన్నారు.

READ MORE: Relationship: మీ అత్తగారు మీపై చిరాకు పడుతున్నారా.. ఇలా చేయండి..!

అప్పటికే బీజేపీ జోక్యాన్ని ఆపాలని ఏక్‌నాథ్ షిండేను అభ్యర్థించానని, అదే జరిగి ఉంటే నాసిక్‌లో హేమంత్ గాడ్సే, యవత్మాల్‌ నుంచి భావన గావ్లీ, హింగోలి నుంచి హేమంత్ పాటిల్ గెలిచి పార్లమెంటుకు చేరుకునేవారని ఆయన అన్నారు. అజిత్‌ పవార్‌ ప్రవేశం ఆలస్యమై ఉంటే బాగుండేదని రాందాస్‌ కదమ్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తామని రాందాస్ కదమ్ చెప్పారు. 100 స్థానాల్లో పోటీ చేస్తే 90 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ వర్గానికి ఈ సారి కచ్చితంగా 100 సీట్లు కావాలని సీఎం షిండేను రాందాస్ కదమ్ అభ్యర్థించారు.

READ MORE: NEET: “హై-లెవల్ కమిటీ ఏర్పాటు, దోషుల్ని వదిలేది లేదు”.. పేపర్ లీక్‌‌లపై కేంద్రమంత్రి..

మరోవైపు, అజిత్ పవార్ సకాలంలో రావడం వల్ల షిండే శిబిరం ప్రాణాలను కాపాడిందని, లేకుంటే లొంగిపోయేదని అజిత్ పవార్ క్యాంపు అధికార ప్రతినిధి అమోల్ మిత్కారీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇదిలావుండగా, ఎవరైనా సరే ఎన్ని సీట్లు కావాలన్నా అడగవచ్చని బీజేపీ నేత, కేబినెట్ మంత్రి గిరీష్ మహాజన్ స్పష్టం చేశారు. అయితే సీనియర్ నాయకత్వం అంతా కలిసి కూర్చుని తుది నిర్ణయం తీసుకోనుందన్నారు. అదే సమయంలో సీట్ల కేటాయింపు విషయంలో ఏకనాథ్ షిండే వర్గం చేస్తున్న డిమాండ్లపై ఉద్ధవ్ వర్గం మండిపడుతోంది. ఉద్ధవ్ వర్గం అధికార ప్రతినిధి ఆనంద్ దూబే వ్యంగంగా మాట్లాడారు.