ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. భారత్- శ్రీలంక మధ్య 3 టీ20 ఇంటర్నేషనల్, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. అయితే.. టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే లంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వనిందు హసరంగ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధృవీకరించింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో తన సారథ్యంలోని జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కారణంగా హసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా తన నిర్ణయం తీసుకున్నట్లు హసరంగ తన రాజీనామా లేఖలో పేర్కొన్నాడు.
Lavanya Parents Interview: అల్లుడు తిరిగొస్తే చాలు.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య పేరెంట్స్
“ఒక ఆటగాడిగా నేను ఎల్లప్పుడూ శ్రీలంక కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను.. నేను ఎప్పటిలాగే నా జట్టు, నాయకత్వానికి మద్దతు ఇస్తాను.” హసరంగా తెలిపారు. “మా అంతర్జాతీయ క్రికెట్ ప్రణాళికలలో హసరంగా మాకు ఒక ముఖ్యమైన ఆటగాడిగా కొనసాగుతారని శ్రీలంక క్రికెట్ తెలియజేస్తుంది” అని శ్రీలంక క్రికెట్ అతని రాజీనామాను ఆమోదిస్తూ ఒక ప్రకటనలో తెలిపింది.
Wagon R: సరికొత్త మైలురాయిని సాధించిన వ్యాగన్ఆర్.. ఐదేళ్లలో 10 లక్షలకు పైగా కార్ల విక్రయం
అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా, కోచింగ్ సిబ్బందిలో కూడా ముఖ్యమైన మార్పులు జరిగాయి. ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ గతంలో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. సిల్వర్‌వుడ్ మార్గదర్శకత్వంలో శ్రీలంకకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌లో వనిందు హసరంగ నేతృత్వంలోని జట్టు నెదర్లాండ్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కాగా.. జూలై 26న పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక, భారత్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నెలాఖరులో భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ప్రకటించింది. ఈ సమయంలో శ్రీలంక-భారత్ మధ్య మూడు టీ-20, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. భారత కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కి ఇదే తొలి పర్యటన.