NTV Telugu Site icon

Davos: దావోస్ సమ్మిట్.. వరంగల్‌కు పరిశ్రమలు.. ఆయనే కీలకం..!

Davos

Davos

Davos: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొంది.. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సాగుస్తోన్న ఈ పర్యటనలో సదస్సు ప్రారంభం రోజే దాదాపు రూ.38 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి.. అదానీ గ్రూప్, అంబుజా సిమెంట్స్, జేఎస్‌డబ్ల్యూ, గోది ఇండియా, వెబ్‌ వర్క్ (ఐరన్‌ మౌంటెన్‌), అరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, గోద్రెజ్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక, దావోస్‌ సమ్మిట్‌ నుంచి వరంగల్‌కు భారీగా పెట్టుబడులు, పరిశ్రలము రానున్నాయి.. ఆ దిశగా బిజినెస్ సమ్మిట్ లో చర్చలు జరుపుతున్నారు వరంగల్ గడ్డకు చెందిన నంబర్ 1 గుంటి శ్రీధర్ రావు.. తన జన్మ స్థలానికి పరిశ్రమలు తీసుకొచ్చే దిశలో దావోస్ బిజినెస్ మీట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.. దీంతో, త్వరలోనే వరంగల్ కు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడతాయని అంచనా వేస్తున్నారు.

Read Also: Balakrishna: బాలయ్య అనింది ఎన్టీఆర్ ని కాదు రా బాబు… ఇది చూడండి కాస్త

దావోస్‌ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలతో వరంగల్ నంబర్ వన్ గా మారుతుందా? కొత్త కొలువులతో , కళకళలాడుతుందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. దావోస్ బిజినెస్ మీట్‌లో వరంగల్ కు చెందిన గుంటి శ్రీధర్ రావు.. పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. కర్ణాటకతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో టెలి కమ్యూనికేషన్ పరిశ్రమలు కలిగిఉన్న ఆయన.. తను పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలన్న మమకారంతో.. దావోస్‌ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్నారు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో బిజీబిజీగా గడుపుతున్నాడు, పలు సెల్ కంపెనీలకు చెందిన ప్రముఖులతో గుంటి శ్రీధర్ రావు హిస్టారికల్ సిటీ వరంగల్ గురించి చెబుతూ.. పరిశ్రమలు తీసుకువచ్చే దిశలో చర్చలు జరుపుతున్నారు.. ఇది సక్సెస్ అయితే త్వరలో వరంగల్ కు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రానున్నాయి.. దీనితో వరంగల్ ముఖచిత్రం మారడంతో పాటు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

1