NTV Telugu Site icon

United Kingdom: మా డిమాండ్లకు మద్దతిచ్చిన వారికే ఓట్లు.. బ్రిటన్ లో మేనిఫెస్టో విడుదల చేసిన హిందువులు

New Project (2)

New Project (2)

జూలై 4న బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడున్న బ్రిటన్ హిందువులు భవిష్యత్తు ప్రభుత్వం కోసం తమ డిమాండ్లకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. 32 పేజీల మేనిఫెస్టోను విడుదల చేయడం ఇదే మొదటి సారి. ఈ డిమాండ్లకు ఒప్పుకున్న వారికే ఓటు వేస్తామని వారు స్పష్టం చేశారు. ముసాయిదా మేనిఫెస్టోను ‘హిందుస్ ఫర్ డెమోక్రసీ’ సంయుక్తంగా విడుదల చేసింది. ఈ డిమాండ్లలో హిందువులపై ద్వేషాన్ని ఆపడం, దేవాలయాలను రక్షించడం వంటి అంశాలు ఉన్నాయి.

READ MORE: Heart Pain-Acidity: గుండెనొప్పి, ఎసిడిటీ వల్ల ఛాతిలో కలిగే బాధ మధ్య తేడా ఇదే..

‘హిందుస్ ఫర్ డెమోక్రసీ’ అనేది BAPS స్వామినారాయణ్ సంస్థ, చిన్మోయ్ మిషన్, విశ్వ హిందూ పరిషత్ (VHP) UK విభాగం, హిందూ కౌన్సిల్ UK, హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్, హిందూ టెంపుల్ నెట్‌వర్క్ UK, హిందూ దేవాలయాల జాతీయ మండలితో సహా 15 హిందూ సంస్థల సమూహం. ఇస్కాన్ UK కూడా ఉంది. ఇప్పటివరకు, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు, బాబ్ బ్లాక్‌మన్, రాబర్ట్ బక్‌ల్యాండ్, రాహిష్ సింగ్, తెరాస విలియర్స్ ఈ మేనిఫెస్టోకు మద్దతు ఇచ్చారు. “X” (గతంలో ట్విట్టర్)లో తన డిమాండ్లను పంచుకుంటూ.. రాబోయే ప్రభుత్వం నుంచి ‘ఏడు డిమాండ్లు’ కోరినట్లు సమూహం తెలిపింది.

READ MORE: Terror attack: జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్.. భద్రతా బలగాలపై ఉగ్రదాడికి అవకాశం..

2021 జనాభా లెక్కల ప్రకారం.. ఇంగ్లాండ్, వేల్స్‌లో హిందువుల సంఖ్య 1,0327,75గా ఉంది. ఇది మొత్తం ఆ దేశ జనాభాలో 1.7 శాతం. బ్రిటన్‌లో హిందూ మతం మూడవ అతిపెద్ద మతంగా అవతరించింది. ఇది క్రైస్తవం, ముస్లిం మతం తర్వాత మూడవ స్థానంలో ఉంది. చాలా మంది హిందువులు గ్రేటర్ లండన్, సౌత్ ఈస్ట్‌లో నివసిస్తున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మరో మూడు దేశాల్లో హిందువుల జనాభా 50,000 కంటే తక్కువగా ఉంది. హిందువులు 19వ శతాబ్దం ప్రారంభం నుండి యునైటెడ్ కింగ్‌డమ్‌లో స్థిరపడటం ప్రారంభించారు.

బ్రిటన్‌లోని హిందువులు ప్రజాస్వామ్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఈ క్రింది ఏడు ప్రతిజ్ఞలను సమిష్టిగా డిమాండ్ చేశారు.బ్రిటన్‌లోని హిందువులకు సంబంధించిన సమస్యలపై చట్టాలు చేసే ముందు హిందూ సంస్థలను సంప్రదించాలని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీంతో పాటు పలు కీలక అంశాలు ప్రస్తావించారు. బ్రిటన్‌లో సేవలందించిన హిందూ సైనికుల స్మారక చిహ్నం, శ్మశానవాటికలను నిర్మించాలి. మరణించిన మూడు రోజులలోపు హిందూ దహన సంస్కారాలను అనుమతించడానికి కరోనర్ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

Show comments