Telangana Elections: చెదురుముదురు సంఘటనల మినహా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కదులుతున్నారు. మరోవైపు రాజధాని హైదరాబాద్ నుంచి సొంత గ్రామాల్లో ఓటేసేందుకు జనాలు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Read Also:Priyanka Gandhi: మా తల్లులారా.. పిల్లలారా అంటూ తెలంగాణ ఓటర్లకు ప్రియాంక గాంధీ పిలుపు..
తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు తమ తమ సొంత ఊర్లకు బయలు దేరారు. దీంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉన్న కొద్దిపాటి బస్సుల్లో ప్రయాణానికి స్థలం సరిపోకపోవడంతో బస్సులు ఎక్కి స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇటీవల ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రయాణికులు బస్సు ఎక్కి ఇళ్లకు ప్రయాణమయ్యారు.
Read Also:Vikas Raj: నాగార్జున సాగర్ కాంట్రవర్సీపై స్పందించిన సీఈవో వికాస్ రాజ్
ఈ క్రమంలోనే విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్నగర్ నుంచి అబ్దుల్లాపూర్, కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రోడ్డుపై భారీ వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు.